English | Telugu
విజయ్ దేవరకొండ హీరోయిన్ కి రొమాన్స్ చెయ్యాలని ఉందంట..ఆ దర్శకుడు వింటే ఏమైపోతాడో
Updated : Oct 7, 2024
విజయ్ దేవరకొండ(vijay devarakonda)హీరోగా పూరి జగన్నాధ్(puri jagannadh)దర్శకత్వంలో వచ్చిన లైగర్(liger)ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ భామ అనన్య పాండే(ananya panday) మూవీ పరాజయం పాలయ్యినా కూడా అనన్య కి మాత్రం మంచి గుర్తింపే వచ్చింది.ఇక హిందీలో ఇప్పటికే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పార్ట్ 2 ,డ్రీమ్‌గర్ల్ 2 వంటి హిట్ చిత్రాల్లో మెరిసిన అనన్య ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో కంట్రోల్(ctrl)అనే మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కంట్రోల్ ఈ నెల 4 న విడుదల అవ్వగా మౌత్ టాక్ అయితే బాగానే ఉంది.తాజాగా అనన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఫుల్ రొమాంటిక్ సినిమా చెయ్యాలని ఉంది.సంజయ్ లీలా భన్సాలీ నాకెంతో ఇష్టమైన దర్శకుడు. సంజయ్ సినిమాలో ఛాన్స్ కోసం కూడా ఎదురుచూస్తున్నాను. కరణ్ జోహర్ సినిమాలో హీరోయిన్గా చెయ్యాలనే బలమైన కోరిక కూడా ఉంది. నిజానికి నా కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో జానర్ సినిమాల్లో నటించాను. అయితే, రొమాంటిక్, హారర్, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.
అనన్య పాండే బాలీవుడ్ లో పేరు పొందిన చుంకి పాండే(chunky panday)నటుడి కూతురు. ఈయన సుమారు వంద చిత్రాలకి పైగా వివిధ పాత్రల్లో చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. 2019 లో ఎంట్రీ ఇచ్చిన అనన్య ఇప్పటికి వరకు పన్నెండు సినిమాలు చేసింది. ప్రస్తతం శంకర అనే మరో మూవీ చేస్తుంది.