English | Telugu
రజనీకాంత్ సెకండ్ ఆఫ్ మొత్తాన్ని మార్చేశాడు..వెట్టయ్యన్ రిలీజ్ టైంలో దర్శకుడి ఆరోపణ
Updated : Oct 7, 2024
సౌత్ టాప్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్(ks ravi kumar)సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. తన స్వంత భాష తమిళంలోనే కాకుండా తెలుగు అగ్ర హీరోలైన చిరంజీవి(chiranjeevi)తో స్నేహం కోసం,బాలకృష్ణ(balakrishna)తో రూలర్, జై సింహ,నాగార్జునతో బావ నచ్చాడు వంటి సినిమాలు తెరకెక్కించాడు.ఇక తమిళనాట రజనీకాంత్(rajinikanth)కమల్ హాసన్(kamal haasan)శరత్ కుమార్,విజయకాంత్ వంటి స్టార్స్ తో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రజనీ, కె ఎస్ రవికుమార్ కాంబోలో వచ్చిన ముత్తు, పడయప్పా,లింగ వంటి సినిమాలని సౌత్ సినీ ప్రేమికులు అంత త్వరగా మర్చిపోలేరు.
తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లింగ(linga)మూవీ ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు.సిజీ వర్క్స్ కి నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తాన్ని ఆయన మార్చేశారు.అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను కూడా రజనీ తీయించేయడం జరిగింది.పైగా కృతిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ ని యాడ్ చేసి టోటల్ గా లింగ మూవీని గందరగోళం చేసారంటూ కామెంట్స్ చేసాడు.రజనీ కొత్త చిత్రం వెట్టయ్యన్ ఈ నెల పది న విడుదల అవుతున్నసమయంలో రవి కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
2014 లో వచ్చిన లింగ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవగా ముత్తు, పడయప్పా వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదుచేశాయి. ఇక కెఎస్ రవికుమార్ నుంచి చివరగా వచ్చిన చిత్రం బాలయ్య రూలర్ మూవీనే.ప్రస్తుతానికి అయితే ఆయన చేతిలో సినిమాలు లేవు. 1990 లో వచ్చిన పురియాదా పుదీర్ అనే చిత్రంతో మొదలుకొని సుమారు నలభై కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించాడు. దాదాపుగా అన్ని కూడా విజయంతమైన చిత్రాలే. తన ప్రతి సినిమాలో కామిక్ రోల్స్ చెయ్యడం కెఎస్ రవికుమార్ స్పెషాలిటీ.