English | Telugu
ఆనంద్ దేవరకొండ లిప్ లాక్ సీన్‌పై ట్రోల్స్
Updated : Sep 16, 2023
రీసెంట్‌గా రిలీజైన బేబి చిత్రంతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు తను గం గం గణేశా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో తొలిసారి యాక్షన్ మోడ్‌లో కనిపించబోతున్నారు. టీజర్ చూస్తుంటే ఆ విషయం తెలుస్తోంది. అయితే ఇందులో ఆనంద్ దేవకొండ లిప్ లాక్ సీన్ కూడా ఉంది. దీనిపై ఆ సినిమాలో హీరో ఫ్రెండ్‌గా నటించిన ఇమ్మాన్యుయేల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఓ రోజు సెట్స్‌కు వెళ్లిన ఇమ్మాన్యుయేల్‌కి ఆనంద్ దేవరకొండ లిప్ లాక్ సీన్‌కు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.
‘‘ఆనంద్ దేవరకొండ టీజర్‌లో చూపించినట్లు లిప్ లాక్ సీన్ బాగా చేశారు. అయితే ఆ సీన్ కోసం తను ఒకటి, రెండు కాదు 20 టేక్స్ తీసున్నారు. టేక్ తీసుకున్న ప్రతీసారి ఇదంతా నావల్ల కావటం లేదు అని ఆనంద్ చెప్పేవాడు. ఎలాగో 20 టేక్స్ తర్వాత సీన్ ఓకే అయ్యింది’’ అని ఇమ్మాన్యుయేల్ అన్నారు. దీని గురించి చెప్పినప్పుడు సరదాగా అందరూ నవ్వుకున్నారు. అయితే ఆనంద్ దేవకొండ లిప్ లాక్ చేయటానికి ఇన్ని టేక్స్ తీసుకోవటంపై నెటిజన్స్ ట్రోలింగ్ చేయటం స్టార్ట్ చేశారు. అర్జున్ రెడ్డి తమ్ముడివి అయ్యుండి.. లిప్ లాక్‌కి అన్ని టేక్స్ తీసుకుంటే ఎలా బ్రో అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు.
గం గం గణేశా చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్స్‌తో ఉంటాయని ఆనంద్ దేవరకొండ తెలిపారు. ‘నా గత చిత్రాలతో చూస్తే ఈ మూవీ డిఫరెంట్ మూవీ. నేను కథను నమ్మే సినిమా సెలెక్ట్ చేసుకుంటా. కొత్త వాళ్లైనా, ఎక్సీపిరియన్స్డ్ డైరెక్టర్స్ అయినా హిట్స్, ఫ్లాప్స్ ఇస్తారు. కానీ ప్రతి దర్శకుడికి ఓ విజన్ ఉంటుంది. నేను దాన్ని నమ్మి సినిమా చేస్తాను’ అని తెలిపారు హీరో ఆనంద్ దేవకొండ. ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.