English | Telugu

‘మైత్రీ’ వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్: మైత్రీ
నటీనటులు: హన్సిక మోత్వానీ, శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్, ముగెన్ రావ్, తదితరులు
ఎడిటింగ్: అషిష్ జోసెఫ్
మ్యూజిక్: ఎస్ గణేశన్
సినిమాటోగ్రఫీ: కార్తిక్ ముతుకుమారన్
నిర్మాతలు: రాజా రామ్ మూర్తి
రచన, దర్శకత్వం: ఎం రాజేశ్
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

హీరోయిన్ హన్సిక చేసిన తొలి వెబ్ సిరీస్ 'మైత్రీ'. ఈ సిరీస్ కి ఎం రాజేశ్ దర్శకత్వం వహించగా, హన్సికతో పాటు శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్ కీలకపాత్రల్లో నటించారు.

కథ:

ఊటిలోని ఒక ఎస్టేట్ లో ఆదిత్య చంద్రశేఖర్ అనే అతను ఉంటాడు. అతనికి చాలా కంపెనీలు , టీ ఎస్టేట్స్ ఉన్నాయి. అయితే అతను మాత్రం అక్కడ టీ ఎస్టేట్ లో ఒంటరిగా ఉంటాడు. కారణం అతనికి ఒక జబ్బు ఉంది. అదేంటంటే ఒక మనిషి తన దగ్గరగా వస్తుంటే అతనిలో కొన్ని ఉత్పేరకాలు ఏర్పడి అతని శరీరమంతా దద్దుర్లలాగా వ్యాపిస్తాయి‌ అయితే అతనికి వచ్చిన ఈ జబ్బుకి అసలు ట్రీట్ మెంట్ అనేదే ఉండదు. దాంతో ఆదిత్య తన పదవ ఏట నుండే ఒంటరిగా ఉంటాడు‌. ఇక ఒక వయసొచ్చాక కంపెనీలను చేసుకుంటాడు‌. ఇక అతడిని చూసుకోడానికి ఒక రోబోని తెచ్చుకుంటాడు‌‌. మనుషలంటే పడని ఓ ఫోబియా ఉన్న ఆదిత్య అందరిలాగా మాములు మనిషి అయ్యాడా? ఆ రోబో ఆదిత్య లైఫ్ లో తెచ్చిన మార్పేంటి? అసలు అది రోబోనా లేక మనిషా తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ 'మైత్రీ' వెబ్ సిరీస్ ని చూడాల్సిందే.

విశ్లేషణ:

సైంటిఫిక్ అండ్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూర్చిన ఈ 'మైత్రీ' వెబ్ సిరీస్ కొత్తగా ఉంది‌. హ్యుమన్ ఎలర్జీ ఉన్న ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే, అతనికి హాని చేయకయండా ఉండేలా ఒక రోబోట్ ని తీసుకుంటే అది ఎలా తన మనసుని మార్చేసిందో తెరపై చూపించడంలో డైరెక్టర్ ఎం రాజేశ్ సక్సెస్ అయ్యాడు.

ఇలియాజ్ అనే యంగ్ రోబోటిక్ సైంటిస్ట్ తన మాజీ ప్రేమికురాలి గుర్తుగా క్రియేట్ చేసిన ఒక రోబో.. తనకెలా ఉపయోగపడింది‌. మనుషులకు హాని చేసిందా లేదా సహాయపడిందా అంటు ప్రతీ ఎపిసోడ్‌ కి కాస్త ట్విస్ట్ ఇస్తూ ఫుల్ ఎంగేజ్ చేశాడు డైరెక్టర్ ఎం రాజేశ్. నిడివి కాస్త ఇబ్బందిగా ఉంటుంది‌. ఒకటి రెండు ఎపిసోడ్ లు ముప్పై నినిషాలు ఉంటాయి తప్ప మిగిలినవన్నీ ఎపిసోడ్ లు మనకి చూడాలంటే కాస్త ఓపిక అవసరమే. రెండు మూడు సినిమాలని చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. ఎపిసోడ్ లలో.. మొదటిది, రెండవది కాస్త క్యూరియాసిటిని పెంచేశాడు. ఇక వెళ్తున్న కొద్దీ ఇంకా ఇది అవదా అనే స్థితికి వస్తుంది. లైఫ్ లో ప్రతీ మనిషికి ఒకరి మైత్రి అవసరముంటుంది. మన వల్ల మన చుట్టూ ఉండేవాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే డైలాగ్ ఈ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది‌. ఇక చివరి ఎపిసోడ్ లో ప్రతీ మనిషికి బ్రతికే స్వేచ్చ ఉంది‌. ఒంటరిగా ఉండకూడదంటూ ఒక కథని ప్రేక్షకుడితో చెప్తున్నట్టుగ అది ప్రతీ మనిషికి అవసరమంటూ ముగించిన తీరు బాగుంటుంది.

డైరెక్టర్ తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అయితే అది చెప్పడానికి అతను ఎంచుకున్న కథని ప్రేక్షకుడికి అర్థం చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒక్కో ఎపిసోడ్ ముప్పై నిమిషాల పైన ఉంటుంది‌. ఈ వెబ్ సిరీస్ మొత్తంగా తొమ్మిది ఎపిసోడ్‌లు అంటే చూసే ప్రేక్షకుడికి చాలా ఓపిక ఉండాలి. అప్పటికీ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చక్కని కథని, ఎంగేజింగ్ చేశాడు. కానీ నాలుగు ఎపిసోడ్ లలో గంటన్నరలో ముగించొచ్చు. అసలు కథలోకి వెళ్ళడానికే చాలా టైమ్ తీసుకున్నాడు డైరెక్టర్. అయితే మొదటి రెండు, చివరి ఎపిసోడ్ ని ఆకట్టుకునేలా మలిచడంలో డైరెక్టర్ ఎం రాజేశ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నేపథ్య సంగీతం బాగుంది. డైలాగ్స్ గుర్తించుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది‌. ముఖ్యంగా ఊటి అందాలని చక్కగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు ‌ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

మైత్రీ పాత్రలో ఒకవైపు అమ్మాయిగా, ఒకవైపు రోబోట్ గా ఆకట్టుకుంది హన్సిక. శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్ లు మంచి సహాయాన్ని అందించారు. ఇక మిగిలిన వాళ్ళు వారి పరిధి మేర చక్కగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

నిడివి ఎక్కువ ఉన్న సైంటిఫిక్ తో పాటు వినోదం, సెంటిమెంట్ అంటు అన్నింటిని మిక్స్ చేసి తీసిన ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకునేలా ఉంది. ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ : 3 / 5

✍🏻. దాసరి మల్లేశ్

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.