English | Telugu

సీక్వెల్‌ ప్లానింగ్‌లో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’... ఎలాగంటే?

రవితేజ, అసిన్‌, జయసుధ, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తమిళ్‌లో జయం రవితో అతని అన్న మోహన్‌రాజా ‘ఎం కుమరన్‌ సన్నాఫ్‌ మహాలక్ష్మి’ పేరుతో రూపొందించారు. తమిళ్‌లో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. జయం రవి, ఆసిన్‌ హీరో హీరోయిన్స్‌ గా నటించిన ఈ సినిమాలో జయసుధ చేసిన మదర్‌ రోల్‌ తమిళంలో నదియా చేశారు.

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ ప్లానింగ్‌లో ఉన్నారు మోహన్‌ రాజా. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. ఈ సీక్వెల్‌లో మదర్‌ క్యారెక్టర్‌ ఉండదు కాబట్టి హీరోయిన్‌ ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది ఎందుకంటే ఫస్ట్‌ పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన అసిన్‌ పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 2015లో ఆమె చేసిన చివరి సినిమా రిలీజ్‌ అయ్యింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. మరి ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది.