English | Telugu

జూన్ 12న అమలా పెళ్లి

హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఎఎల్ విజయ్ గతకొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ ఈ జంట తప్పించుకున్నారు. కానీ ఇపుడు మాత్రం పెళ్ళికి సిద్ధమయ్యారు. "నాన్న", "అన్న" చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు ఎఎల్ విజయ్ అందరికి సుపరిచితుడే. అలాగే అమలాపాల్ గురించి తెలియనివారుండరు. వీరిద్దరూ జూన్ 12న వివాహం చేసుకోబోతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అమలా స్పందిస్తూ..."ప్రస్తుతం విజయ్ అమెరికాలో ఉన్నారు. చెన్నైకి తిరిగొచ్చాక పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తాను" అని చెప్పుకొచ్చింది. అంటే త్వరలోనే ఈ ప్రేమజంట సాంబార్, రైస్ పెట్టబోతున్నారన్నమాట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.