English | Telugu
అల్లు అర్జున్ తమ్ముడి పేరు బడ్డీ.. మెగా ఫ్యాన్స్ లో జోష్
Updated : May 14, 2024
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా 2003 లో వచ్చిన గంగోత్రితో అల్లు అర్జున్ సినీ రంగ ప్రవేశం చేసాడు.సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటు లక్షలాది మంది అభిమానులతో పాటు స్టైలిస్ట్ స్టార్,ఐకాన్ స్టార్ అనే బిరుదులని కూడా పొందాడు.ఇక అల్లు అర్జున్ తమ్ముడుగా అల్లు శిరీష్ 2013 లో సినీ రంగ ప్రవేశం చేసాడు. టు డే ఆయనకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది
అల్లు శిరీష్ హీరోగా సామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బడ్డీ. చాలా కాలం క్రితమే ఈ మూవీ అనౌన్స్ మెంట్ అయ్యింది. తాజాగా బడ్డీ టీం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఫస్ట్ సాంగ్ రేపు ఉదయం పది గంటలకు విడుదల కానుంది. ఆ పిల్ల కనులే అనే లిరిక్ తో సాంగ్ ప్రారంభం కానుంది. దీంతో సుమారు ఏడాది తర్వాత అప్ డేట్ వచ్చినట్టయ్యింది. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ కాగా అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు
2021 లో తమిళ అగ్ర నటుడు ఆర్య నటించిన టెడ్డీకి అల్లు శిరీష్ బడ్డీ రీమేక్. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్ రాజా ఆ చిత్రాన్ని నిర్మించాడు.ఇప్పుడు తెలుగులోను ఆయనే నిర్మిస్తున్నాడు. సూర్య సింగం సిరీస్ తో పాటు ఎన్నో హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. శ్రీరస్తుశుభమస్తు, ఒక్క క్షణం లాంటి హిట్ చిత్రాలు శిరీష్ ఖాతాలో ఉన్నాయి. మొత్తానికి బడ్డీ న్యూస్ మెగా ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని తెచ్చింది.