English | Telugu

అల్లు అర్జున్‌పై అట్లీ చేస్తున్న అద్భుతమైన ప్రయోగం.. తెలిస్తే షాక్‌ అవుతారు

'పుష్ప2' వంటి గ్రాండ్‌ సక్సెస్‌ తర్వాత అల్లు అర్జున్‌ చేయబోతున్న సినిమాపై ఇప్పటి నుంచే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడుతున్నాయి. అట్లీ కాంబినేషన్‌లో బన్నీ చేస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన అరుదైన విశేషం ఏమిటంటే.. ఇందులో అల్లు అర్జున్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ సినిమా షఉటింగ్‌ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో, మోడ్రన్‌ టెక్నాలజీతో ఒక సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు అట్లీ. అల్లు అర్జున్‌ తన కెరీర్‌లోనే మొదటిసారి మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మూడు ప్రపంచాలకు సంబంధించిన కథగా ఈ సినిమా ఉండబోతోంది. అట్లీ ఊహించిన దానికంటే ఎక్కువగా బన్నీ పెర్‌ఫార్మ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఎంతో కేర్‌ఫుల్‌గా అట్లీ డిజైన్‌ చేసిన ఒక ఏజ్డ్‌ క్యారెక్టర్‌ కూడా అందులో ఉంది. ఆ పాత్రను అల్లు అర్జున్‌ తనదైన స్టైల్‌లో అద్భుతంగా పోషిస్తున్నారని తెలుస్తోంది. రెండోసారి ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు అందుకునే రేంజ్‌లో అతని పెర్‌ఫార్మెన్స్‌ ఉందని యూనిట్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ఆ గెటప్‌, ఆ క్యారెక్టర్‌ ఈ సినిమాకి వెరీ స్పెషల్‌ కాబోతోంది. సినిమా రిలీజ్‌ వరకు ఆ క్యారెక్టర్‌ని సస్పెన్స్‌లోనే ఉంచాలని డిసైడ్‌ అయ్యారు. అల్లు అర్జున్‌, అట్లీ ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారని తెలుస్తోంది. దానికోసం ఎఐ సహకారం కూడా తీసుకుంటున్నారు. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం ప్రపంచ స్థాయి కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .