English | Telugu
కేజిఎఫ్ యష్ గురించి ఎవరికి తెలుసంటున్న అల్లు అరవింద్!
Updated : Nov 7, 2023
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటి. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ని చూసి సినిమాకి వెళ్లే ప్రేక్షకులు కోకొల్లలు. ఆ సంస్థ అంత ఇమేజ్ ని సంపాదించడానికి ప్రధాన కారణం ఆ సంస్థ అధినేత అల్లు అరవింద్. ఈ విషయం సినీ ప్రేమికుల అందరికి తెలిసిందే. హీరో తో పాటు కథ కి ప్రాముఖ్యత ఇవ్వడం వలనే గీతా ఆర్ట్స్ 40 సంవత్సరాల నుంచి అప్రహతీతంగా ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ కన్నడ సూపర్ స్టార్ యష్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ సర్కిల్స్ లో చర్చినీయాంశ మయ్యాయి.
గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ అయిన జి ఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు తెరకెక్కించిన మూవీ కోటబొమ్మాళి పిఎస్.ఈ సినిమా టీజర్ రిలీజ్ కి సంబంధించిన కార్యక్రమంలో అల్లు అరవింద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొంత మంది విలేకర్లు అరవింద్ గారితో మీరు ఎందుకని ఈ మధ్యన చిన్న సినిమాలని మాత్రమే నిర్మిస్తున్నారని అడిగారు. దానికి ఆయన భారీగానే బదులు ఇచ్చాడు. కొంత మంది నేను భారీగా పెరిగిన సినిమా నిర్మాణ వ్యయం మూలంగానే పెద్ద సినిమాలని తెరకెక్కించడం లేదని అనుకుంటున్నారని అదంతా అబద్దం అని ఆయన అన్నారు.
అసలు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోను బయట కూడా సినిమా బడ్జట్ ఎక్కువగా పెరగడానికి హీరోలు తీసుకునే రెమ్యునరేషనే కారణం అనే చర్చ కూడా జరుగుతుంది. హీరో రెమ్యునరేషన్ కేవలం సినిమా బడ్జట్ లో 25 శాతం మాత్రమే అని కూడా ఆయన అన్నారు. అంతటి తో ఆగకుండా హీరోతో సంబంధం లేకుండా కేజిఎఫ్ సినిమాని నిర్మాతలు భారీ వ్యయంతో తెరకెక్కించలేదా? కేజిఎఫ్ రిలీజ్ కి ముందు ఆ సినిమా హీరో యష్ గురించి ఎవరికైనా తెలుసా ? కేజిఎఫ్ సినిమా తర్వాతే యష్ ఎవరో అందరికి తెలిసిందని అరవింద్ అన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సౌత్ ఫిలిం సర్కిల్స్ లో సెగలు పుట్టిస్తున్నాయి.
జి ఏ 2 బ్యానర్లో తెరకెక్కుతున్న కోటబొమ్మాళి పి ఎస్ మూవీ మలయాళ హిట్ మూవీ నాయప్పు కి రీమేక్ గా తెరకెక్కుతుంది.తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.