English | Telugu

అల్ల‌రోడికి దెబ్బడిపోయింది

'మూలిగే న‌క్క‌పై తాటికాయ్ ప‌డిన‌ట్టుంది మ‌న అల్ల‌రి న‌రేష్ ప‌రిస్థితి. అస‌లే హిట్లు లేవు. ఆ మాట విని అయ్యగారికి చాలాకాలం అయ్యింది. ఎంత కామెడీ చేసినా జ‌నం న‌వ్వ‌డం లేదు. ఇప్పుడాయ‌న నిర్మాత‌గానూ మారాడు.... బందిపోటుతో. ఫ‌లితం శూన్యం. తొలిరోజే ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకొంది. న‌రేష్‌కి ఉన్న మినిమం గ్యారెంటీ హీరో ట్యాగ్ లైన్ ఈ సినిమాతో మ‌టాష్ అయిపోయిన‌ట్టే. ఎంద‌కంటే ఈ సినిమాని ఎవ్వ‌రూ కొన‌లేదు. బ‌య్య‌ర్లు అల్ల‌రోడి సినిమాని కొన‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోయారు. ఆఖ‌రికి శాటిలైట్ కి కూడా అమ్ముడు పోలేదు. న‌రేష్ ఓవ‌ర్ కాన్పిడెన్స్ కొద్దీ..`ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూసుకొందాంలే.. అప్పుడు మంచి రేటు వ‌స్తుంది` అని.. ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేదు. అంతేకాదు.. చాలా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకొన్నాడు. తొలి రోజు 50 శాతం ఆక్యుపెన్సీ కూడా క‌నిపించ‌లేదు. దాంతో.. న‌రేష్ కి ఫుల్లుగా మ‌డ‌త‌డిపోయింది. హీరోగా, నిర్మాత‌గా రెండు విధాలా లాసైపోయాడు. శ‌నివారం వ‌సూళ్లు ఓ మాదిరిగా ఉంటాయ్‌. ఆదివారం ఇండియా - సౌతాఫ్రికా వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ఉంది. సో.. మార్నింగ్ షో, మ్యాట్నీలు ఔట్‌. ఈలోగా టాక్ బాగా స్ప్రెడ్ అయిపోతే.. బందిపోటు సోమ‌వారం నుంచి థియేట‌ర్ల‌లో క‌న‌ప‌డ‌ని ప్ర‌మాదం పొంచి ఉంది. సో బ్యాడ్ ల‌క్ న‌రేష్‌.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.