English | Telugu

‘మేముసైతం’ సెలబ్రిటీ క్రికెట్ విజేత అఖిల్ టీమ్

తెలుగు సినీ చిత్రపరిశ్రమ చేపట్టిన ‘మేముసైతం’ కార్యక్రమంలో భాగంగా 'సెలబ్రిటీ క్రికెట్' సరదా సరదాగా సాగిపోతుంది. మ్యాచ్‌లో హీరోలు, హీరోయిన్లు కలిసి ఆడటం ఇక్కడ స్పెషల్‌. ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఫేం సాయిధరమ్‌తేజ, అఖిల్‌కి బౌలింగ్‌ చేశాడు. మ్యాచ్‌లో కొన్నిసార్లు ప్రొఫెషనల్‌గా ఆటగాళ్ళ ఆటతీరు కన్పించినా, ఆ తర్వాత సరదా సరదాగా మారిపోయింది. మొదటి మ్యాచ్ నాగార్జున, ఎన్టీఆర్ టీంల మధ్య జరిగింది. నాగార్జున టీంకు అఖిల్ అక్కినేని కెప్టెన్ గా వ్యవహరించగా, ఎన్టీఆర్ టీంకి శ్రీకాంత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ మ్యాచ్ లో నాగార్జున టీం విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బ్యాట్‌తో ఫోర్లు బాదిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, బౌలింగ్‌లో ఓ వికెట్‌ కూడా తీయడం గమనార్హం.

రెండో మ్యాచ్ రామ్ చరణ్, వెంకటేష్ టీమ్ ల మధ్య జరగగా వెంకటేష్ టీమ్ గెలిచింది. అఖిల్, విక్టరీ వెంకటేష్ టీంల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను 2 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన అఖిల్ టీమ్ 2 ఓవర్లలో 26 పరుగులు చేశారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వెంకటేష్ టీమ్ లక్ష్యాన్ని చేదించలేకపోయింది. 4 పరుగుల తేడాతో అఖిల్ టీమ్ విజేత గా నిలిచింది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.