English | Telugu

ప్రాబ్లమ్స్ క్లియర్.. క్లారిటీ వచ్చిన అఖండ 2 షోస్ డిటైల్స్ ఇవే


-నో ప్రాబ్లమ్స్
-రేపు జాతర స్టార్ట్
-నో డౌట్స్

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)..సుదీర్గ కాలం నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ పేరు వినపడితే చాలు, అప్పటి వరకు బాక్స్ ఆఫీస్ అమ్ముల పొదిలో ఉన్న రికార్డులు వాటంతట అవే పక్కకి జరిగి బాలయ్య పేరుని తమ అక్కున చేర్చుకుంటాయి. ఈ కోవలోనే అఖండ 2 తో మరోసారి రికార్డులని తమ ఒడిలో ఉంచుకోవడానికి సిద్ధమయ్యాయి.

కొన్ని కారణాల వల్ల ఈ రోజు నైట్ ప్రదరించాల్సిన ప్రీమియర్స్ ఆగిపోయాయి. దీంతో అభిమానుల్లో కొద్దిగా నిరుత్సాహం వచ్చింది. కొన్ని ఏరియాల్లో తమ నిరసన ని కూడా వ్యక్తం చేసారు. కానీ ఓవర్ సీస్ లో మాత్రం యధావిధిగా అనుకున్న టైంకే ప్రారంభం కానున్నాయి. ఇండియాలో మాత్రం రేపు ఉదయం నుంచి షోస్ స్టార్ట్ కాబోతున్నాయని నిర్మాతలు ప్రకటించారు. కానీ నిర్మాతలకి ఉన్న ఆర్ధిక ఇబ్బందుల వల్లే బెనిఫిట్ షో స్ ప్రదర్శించలేకపోయారనే వార్తలు వైరల్ గా నిలవడంతో అభిమానులు మరో అధికార అప్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

also read: బాలయ్య అభిమానుల ఆందోళన.. రిలీజ్ పై నిర్మాతలు చెప్పింది ఇదే

ఈ క్రమంలోసోషల్ మీడియా వేదికగా పలు మీడియా ఛానల్స్అఖండ 2 రిలీజ్ కి సంబంధించిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఫైనాన్షియల్ మాటర్ మొత్తం క్లియర్ అయింది. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇండియాలో షోస్ ప్రారంభం కానున్నాయని తెలిపింది. దీంతో అభిమానుల్లో తిరిగి జోష్ వచ్చినట్లయ్యింది. సో రేపు ఉదయం నుంచి థియేటర్స్ దగ్గర బాలయ్య శివ తాండవం ప్రారంభం కానుంది. సినిమా రిజల్ట్ విషయంలో అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే వస్తుంది.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.