English | Telugu

వ‌రుస చిత్రాలతో బిజీగా ఉన్న తల!

కోలీవుడ్ స్టార్ తల అజిత్ కుమార్ వ‌రుస కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను చేస్తున్నారు. యాక్ష‌న్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల‌లోనే విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన దూకుడు చూపిస్తున్నారు. ఇటీవల తునివు అనే చిత్రం చేశారు. ఈ చిత్రం తెలుగులో ఆడకపోయినా తమిళనాడులో విపరీతమైన కలెక్షన్స్ రాబట్టింది. యావరేజ్ టాక్ తో కూడా ఓ రేంజిలో సక్సెస్ను సాధించింది. నిర్మాతలకు లాభాలను అందించింది. చాలా మంది ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించ‌డ‌మే గొప్ప అన్నారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద టాక్ తో సంబంధం లేకుండా అద్భుత‌మైన ఫ‌లితాన్ని రాబ‌ట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించిన తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్ల జోరు తగ్గలేదు. సినిమా అతిగా ఉంది. ఎలివేషన్స్ ఓవర్ గా ఉన్నాయి, యాక్ష‌న్ సీన్స్ డోస్ పెరిగింది వంటి విభిన్న‌మైన నెగ‌టివ్ టాక్ వ‌చ్చింది. అయినా ఇవేమీ ఈ చిత్రానికి క‌లెక్ష‌న్ల ప‌రంగా ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేకపోయాయి. దాంతో కోలీవుడ్ లో ఈ చిత్రం విజయవంతమైన చిత్రంగా నిలబడింది. అజిత్ కుమార్ దీని తరువాత నయనతార భర్త విగ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు.

ఇందులో ప్రతినాయకగా ఐశ్వర్యారాయ్ న‌టిస్తుండ‌గా హీరోయిన్ గా నయనతార నటిస్తోందని సమాచారం. మరో కీలకపాత్రను సాయి పల్లవి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని త‌ర్వాత అజిత్ ఆమధ్య త‌న‌తో వరుస బ్లాక్ బ‌స్ట‌ర్లు చిత్రాల‌ను తీసిన సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు వ‌చ్చిన చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యాల‌ను న‌మోదు చేశాయి. అన్ని క‌మ‌ర్షియ‌ల్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం శివ సూర్యతో హిస్టారికల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత అజిత్-సూర్య‌ల చిత్రం ఉండ‌నుంది. వీరిద్దరితో పాటు కమర్షియల్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అజిత్ ఓ చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో జవాన్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన వెంటనే అట్లీ- అజిత్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం మొద‌ల‌వుతుంది. ఇప్పటికే అట్లీ స్టోరీని అజిత్ చేత ఓకే చేయించుకున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరితో ముందుగా సినిమాలను స్టార్ట్ చేస్తాడు అనేది ఆయా దర్శకుల వెసులుబాటు..... అజిత్ నిర్ణయం మేరకు ఉంటాయి. మొత్తంగా ఈ మూడు చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతుండడం విశేషం. మరి ఈ చిత్రాలతో అజిత్ ఎలాంటి సంచలనాలు సృష్టించనున్నాడో వేచి చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.