English | Telugu

అడివి శేష్‌ రాకతో ఆమె జీవితంలో ఏం జరిగింది?

అడివి శేష్‌, శృతిహాసన్‌ జంటగా ఓ సినిమా రూపొందనుందన్న అప్‌డేట్‌ ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా యాక్షన్‌ డ్రామా నుంచి మేకర్స్‌ గురువారం సెన్సేషనల్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్‌, అడివి శేష్‌ గ్రిప్పింగ్‌ క్యారెక్టర్‌ రివీల్‌ పోస్టర్‌ డిసెంబర్‌ 18న విడుదల కాబోతోంది. తాజాగా విడుదల చేసిన అడివి శేష్‌ ఇంటెన్స్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తీక్షణమైన చూపులతో ముఖాన్ని బ్లాక్‌ స్కార్ఫ్‌తో కప్పుకొని కనిపించారు అడివి శేష్‌. హీరోయిన్‌ శృతిహాసన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అడివి శేష్‌ ఫస్ట్‌లుక్‌ చిత్రాన్ని పోస్ట్‌ చేసి ‘అతని రాక ఆమె జీవితంలో తుఫానును తెస్తుందా? టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ డిసెంబర్‌ 18న??’’ అని కామెంట్‌ చేసింది.

హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్‌ 2022లో చేసిన ‘మేజర్‌’ విజయం సాధించడమే కాకుండా అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చేయనున్న ఈ సినిమా అడివి శేష్‌కి రెండో హిందీ సినిమా అవుతుంది. ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు గతంలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన షానీల్‌కు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. సునీల్‌ నారంగ్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.