English | Telugu

సిద్దార్ధ్ వైఫ్ అదితిరావు హైదరీ పేరుపై మెసేజెస్.. నమ్మొచ్చా! 


-అదితిరావుహైదరీ సంచలన పోస్ట్
-ఎవరు ఆ మోసగాడు!
-అప్ కమింగ్ మూవీస్ తో బిజీ
-అప్రమత్తంగా ఉండాలని పిలుపు


భారతీయ నటి అనే కీర్తిని పొందే అవకాశం కొంత మంది నటీమణులకే లభిస్తుంది. అటువంటి కీర్తిని పొందిన ఒక అరుదైన నటీమణి 'అదితిరావు హైదరి'(Aditi Rao Yydari).రెండు దశాబ్దాల క్రితమే ప్రజాపతి అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రేవేశం చేసి తెలుగుతో పాటు అన్నిబాషల్లోను తన సత్తా చాటుతుంది. గత ఏడాది విజయ్ సేతుపతి తో కలిసి గాంధీ టాకీస్ అనే చిత్రంతో సందడి చేసి ప్రస్తుతం పలు కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

రీసెంట్ గా అదితి ఇనిస్టాగ్రమ్ లో ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ లో కొంతమంది నాకు చెప్పిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒక వ్యక్తి తన ఫోన్ వాట్సాప్‌లో నా ఫోటోలని ప్రొఫైల్ గా ఉపయోగిస్తూ 'ఫోటోషూట్’పేరుతో కొంతమందికి మెసేజులు పంపిస్తున్నాడు. అవి నేను పంపినవి కావు. నేను ఎప్పుడు నా పర్సనల్ నంబర్‌ని వర్క్ కోసం ఉపయోగించను. నా అధికారిక పనులు అన్నీ నా టీమ్ ద్వారానే జరుగుతాయి. అలాంటి మెసేజులు వస్తే వెంటనే నా arhconnect టీమ్‌కి తెలియజేయండి. నాకు ఎప్పుడూ అండగా నిలిచే అభిమానులకి ధన్యవాదాలు. ఫేక్ అకౌంట్ పట్ల అందరు జాగ్రతగా ఉండాలని అదితి తన పోస్ట్‌లో పేర్కొంది.

Also Read: నో స్నాక్, నో షుగర్, నో సోడా.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ఫోన్ వాల్ పేపర్


ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల పేరుతో కొంతమంది ఇలాంటి మోసాలకి పాల్పడుతూ వస్తున్నారు. ఈ విషయంపై అభిమానులు స్పందిస్తు ముందు ముందు మరెవరు ఇలాంటి వాటికి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదితి కి ప్రముఖ హీరో సిద్దార్ధ్(Siddharth)తో వివాహం జరిగిన విషయం తెలిసిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .