నో స్నాక్, నో షుగర్, నో సోడా.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ఫోన్ వాల్ పేపర్
on Nov 16, 2025

-వైరల్ అవుతున్న అల్లు అర్జున్ మొబైల్ వాల్ పేపర్
-సదరు డేట్ కి ఆంతర్యం ఏంటి!
-నో స్నాక్, నో షుగర్, నో సోడా కి అర్ధం
-అయాన్ కి ఏమైనా చెప్తున్నాడా!
ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)ప్రస్తుతం'అట్లీ'(Atllee)తో చేస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పై ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతుంది. అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం సోషల్ మీడియా వేదికగా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ 'దీపికా పదుకునే' కీలక పాత్రలో చేస్తుండటం ఈ చిత్రం స్పెషాలిటీ.
రీసెంట్ గా అల్లు అర్జున్ పర్సనల్ జిమ్ ట్రైనర్ లాడ్ స్టీవెన్స్(Lloyd Stevens)ఇన్ స్టాగ్రామ్(Instargram)వేదిక గా ఒక వీడియో పోస్ట్ చేసాడు. సదరు వీడియో అల్లు అర్జున్ ఫోన్ వాల్ పేపర్ కి సంబంధించినది. ఫోన్ వాల్ పేపర్ పై మార్చి 27 2026 అని టైప్ చేసి ఉండటంతో పాటు నో స్నాక్, నో షుగర్, నో సోడా అనే వర్డ్స్ కూడా టైపు చేసి ఉన్నాయి. ఆ లెటర్స్ కింద అయాన్ అని కూడా టైపు చేసి ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ వాల్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఇటీవల అల్లు అర్జున్ సోదరుడు ప్రముఖ హీరో అల్లు శిరీష్ కి నైనికా తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఇద్దరి వివాహం మార్చి 27 న జరగబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. నో స్నాక్, నో షుగర్, నో సోడా అనే వర్డ్స్ పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్థుతానికి అయితే నో స్నాక్, నో షుగర్, నో సోడా హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది. అల్లు అర్జున్ కొడుకు పేరు అయాన్(Ayaan)అనే విషయం తెలిసిందే.
also read: ఆ మూవీ ఒక యానిమేషన్ ప్రాజెక్ట్! ప్రభాస్ పై బాలీవుడ్ మీడియా ప్రచారం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



