English | Telugu

ఆది "ఏకవీర" కథేంటి

ఆది "ఏకవీర" కథేంటి అంటే 18 వ శతాబ్దానికి చెందిన కథట ఇది. వివరాల్లోకి వెళితే 18 వ శతాబ్దంలో అప్పటి బ్రిటీష్ పాలకులు తెచ్చిన చట్టం అప్పటి ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో, దానికి దొంగతనం వృత్తిగా బ్రతికే జాతికి చెందిన యువకుడు ఎలా తిరగబడ్డాడో ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ "ఏకవీర" చిత్రం కథ. ఈ చిత్రం హీరో ఆది మన తెలుగబ్బాయే అయినా తమిళంలో పేరున్న హీరో. అతను నటించే సినిమాల కథలు చాలా విభిన్నంగా ఉంటాయి.

ఉదాహరణకి "మృగం" సినిమా తీసుకుంటే అలాంటి కథని మన యువ హీరోలెవరూ అంగీకరించరు. అలాగే "వైశాలి" సినిమా కూడా చాలా విభిన్నమైన కథతో తీశారు. ఇక ఈ "ఏకవీర" చిత్రంలో హీరో ఆది గెటప్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఇలా అన్నీ విభిన్నంగానే ఉండటం విశేషం. ఈ "ఏకవీర" కచ్చితంగా హిట్టవుతుందని ఈ చిత్రం యూనిట్ చాలా నమ్మకంతో ఉంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.