English | Telugu
పూర్ణ...ఆయనతో ప్రేమలో పడలేదా?
Updated : Dec 8, 2014
సీమటపాకాయ్, అవును సినిమాలతో ఆకట్టుకొంది పూర్ణ. ఈ రెండు సినిమాలు తప్ప తెలుగునాట పూర్ణ సాధించినదేం లేదు. ఇప్పుడు అవును 2లో నటిస్తోంది. అయితే పూర్ణ పేరు ఈ మధ్య గాసిప్పుల్లో తెగ నలిగింది. ఈ అమ్మడు ప్రేమలో పడిందని, కెమెరామెన్ భరణితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని, త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్పులొచ్చాయి. అంతే కాదు, పూర్ణ కాల్షీట్ల వ్యవహారాలు కూడా భరణినే దగ్గరుండి చూసుకొంటున్నాడని చెప్పారు. వీటిపై పూర్ణ నోరు విప్పింది. ''ప్రేమలో పడ్డానన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేనసలు భరిణితో కలసి ఒక్క సినిమాకీ పనిచేయలేదు. అలాంటప్పుడు మామధ్య అంత చనువు ఎక్కడి నుంచి వస్తుంది? మేమిద్దరం రెండు మూడు సార్లు కలుసుకొన్నామంతే. ఈ మాత్రం పరిచయానికే ప్రేమ అనే పేరు పెట్టకండి'' అంటోంది పూర్ణ. కాకపోతే అటు మలయాళం ఇండ్రస్ట్రీ కూడా ఇది ప్రేమే నిని బల్లగుద్దిమరీ చెబుతోంది. భరణి పూర్ణ విషయంలో కేర్ ఎక్కువగా తీసుకొంటున్నాడని, పూర్ణ ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్ష్యమవుతున్నాడని చెప్తున్నారు. అయితే భరణిది వన్ సైడ్ లవ్వేనంటారా?