English | Telugu

వాడే నా మగాడు: ఆలియా

"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" చిత్రంతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ తనకు కాబోయే వాడికి ఉండవలసిన లక్షణాలను తెలిపింది. "నిజాయితీ, నమ్మకం.. ఈ రెండు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. అతని కుటుంబ సభ్యులు కూడా బలమైన అభిప్రాయాలు కలిగినవారైతే మరీ మంచిది. నన్ను పాతాళానికి తొక్కేసే మనస్తత్వం ఉన్నవాడి కంటే నన్ను అర్థం చేసుకొనే వ్యక్తికే నా ఓటు. అయితే ఇప్పుడే నేను పెళ్ళికి సిద్ధంగా లేని. పరిశ్రమలో నాకంటూ తగిన గుర్తింపు తెచ్చుకున్న తరవాత ఆలోచిస్తాను" అని వెల్లడించింది. అయితే ఇపుడు పెళ్ళికి సిద్ధంగా లేదంటూనే కాబోయేవాడికోసం ఇప్పటి నుంచే ఇలా ఆలోచిస్తుంది అంటే ఈ అమ్మడిపై వస్తున్న ప్రేమ పుకార్లు అన్ని నిజమే అని చెప్పుకోవచ్చు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.