English | Telugu

ప్లీజ్ సాయం చేయండి.. నరేష్ విజయ్ కృష్ణ

సినిమా వాళ్ళు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలోనే కాదు.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ముందుంటారు అని ఇప్పటికే ఎందరో నిరూపించారు. అదే బాటలో సీనియర్ నటుడు విజయ్ కృష్ణ కూడా పయనిస్తున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ డబ్బింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ కి తన వంతుగా లక్ష రూపాయలు సాయం చేసిన నరేష్.. ఎవరికి తోచినంత సాయం వారు చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. "ప్రముఖ డబ్బింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు రెండేళ్లుగా రెగ్యులర్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆయన భార్య శ్రీదేవి గారు కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అవసరమైన అన్ని పరీక్షలు పూర్తి చేసి త్వరలో సర్జరీకి ప్లాన్ చేస్తున్నారు. నేను నా వంతు సహకారం అందించాను. ఆయన త్వరగా కోలుకొని మనల్ని మళ్ళీ అలరించాలని కోరుకుంటున్నాను. నా స్నేహితులతో పాటు అందరూ తమకు తోచిన సాయం చేసి ఈ గొప్ప కార్యక్రమంలో భాగమవ్వాలని కోరుకుంటున్నాను." అని నరేష్ రాసుకొచ్చారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం