English | Telugu

ఫ్రీగా చూడండి.. నచ్చుతుంది 

ఇప్పుడు ప్రేక్షకులు సినిమాల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో వెబ్ సిరీస్ ల కోసం కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురుచూపులకి తగ్గట్టే వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో తులసి వనం అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

తులసి వనం డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యింది. ఈటీవీ విన్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.మేకర్స్ విడుదల చేసిన మూడు ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయనే టాక్ ని అయితే పొందాయి. ఇప్పుడు ఇందులోని ఫస్ట్ ఎపిసోడ్ ని ఫ్రీ గా చూడవచ్చు. దీంతో చాలా మంది తులసి వనాన్ని చేస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని అంటున్నారు.

అక్షయ్ లగుసాని , ఐశ్వర్య, వెంకటేష్ కాకుమాను, టాక్సీవాలా కృష్ణ కీలక పాత్రల్లో నటించారు.పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ సమర్పించగా స్వాగత్ రెడ్డి, నీలిత పైడిపల్లి,జీవన్ కుమార్ లు నిర్మించారు.అనిల్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.