English | Telugu

హోటల్‌ గదిలో నటుడి అనుమానాస్పద మృతి!

ఇటీవలికాలంలో సినిమా ఇండస్ట్రీలో కొన్ని అనూహ్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని విషాదకర వార్తలు కూడా వినాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే ఈమధ్య ఈ తరహా వార్తలు బాగా పెరిగిపోయాయని చెప్పొచ్చు. చిత్ర పరిశ్రమ గత కొన్నిరోజుల్లో ఎంతో మంది కళాకారులను కోల్పోయింది. తాజాగా మరో ఘటన ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేసింది. ప్రముఖ మలయాళీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు కళాభవన్‌ నవాస్‌ కన్నుమూశారు. శుక్రవారం ఎర్నాకులంలోని హోటల్‌ గదిలో అపస్మారక స్థితిలో ఆయన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే నవాస్‌ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆయన వయసు 51 సంవత్సరాలు.

నవాస్‌ మృతికి గల కారణాలు తెలియరాలేదు. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయి వుండవచ్చు అని అనుకుంటున్నారు. అయితే పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం నవాస్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని తెలుస్తోంది. కొచ్చిలో ‘ప్రకంబనం’ అనే సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సాయంత్రం వరకు షూటింగ్‌లో పాల్గొన్న నవాస్‌ హోటల్‌లోని తన గదికి వెళ్లి బయటికి రాలేదు. ఎంతో సేపు చూసిన తర్వాత హోటల్‌ సిబ్బందికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా.. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు షూటింగ్‌ నుంచి వచ్చినపుడు నవాస్‌ హుషారుగానే ఉన్నారని ఆయన్ని చూసిన సిబ్బంది చెబుతున్నారు.

నవాస్‌ మరణ వార్త కేరళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. షూటింగ్‌కి రెండు రోజులు బ్రేక్‌ వచ్చింది. దాంతో ఇంటికి వెళ్లి రావాలనుకుంటున్నానని చెప్పారని తోటి నటీనటులు తెలిపారు. ప్రాథమికంగా దీని అనుమానాస్పద మృతిగానే పరిగణిస్తున్నారు పోలీసులు. నవాస్‌ ఎంతో మంచి మనిషని, శత్రువులెవరూ లేరని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఆరోజు షూటింగ్‌ కూడా ఎంతో హ్యాపీగా పూర్తి చేశారని చిత్ర యూనిట్‌ తెలియజేసింది. ఏది ఏమైనా పోస్టుమార్టం రిపోర్ట్‌ వస్తేగానీ నవాస్‌ మరణం మిస్టరీ వీడదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.