English | Telugu
‘అబ్రహం ఓజ్లర్’మూవీ రివ్యూ
Updated : Mar 20, 2024
మూవీ : అబ్రహం ఓజ్లర్
నటీనటులు: జయరామన్, మమ్ముట్టి, అనస్వర రాజన్, ఆర్య సలీమ్, అర్జున్ అశోకన్, దిలీష్ పోతన్ , సైజు కురుప్ తదితరులు
కథ : రన్ దీర్ కృష్ణన్
ఎడిటింగ్: సమీర్ మహమ్మద్
సినిమాటోగ్రఫీ: తెని ఈశ్వర్
మ్యూజిక్ : మిథున్ ముకుందన్
నిర్మాతలు : ఇర్షద్ ఎమ్ హసన్, మిథున్ మాన్యుల్ థామస్
దర్శకత్వం: మిథున్ మాన్యుల్ థామస్
కథ:-
ఏసీపీ అబ్రహం ఓజ్లర్ తన భార్య, పాపతో కలిసి వెకేషన్ కి వెళ్తాడు. అక్కడ ఫ్యామిలీతో సరదగా గడుపుతున్న ఓజ్లర్ ఉండే కాటేజీకి కాల్ వస్తుంది. మున్నార్ పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నామని, అక్కడ దగ్గర ఓ హోటల్ లో ఇద్దరిని చంపేశారని, అర్జెంట్ గా రమ్మని చెప్పడంతో ఓజ్లర్ అక్కడ నుండి బయల్దేరి వెళ్తాడు. ఇక దారిలో అతని కింద పనిచేసే ఆఫీసర్ కి కాల్ చేసి ఎందుకు డిస్టబ్ చేస్తారని అడుగగా.. మేము ఎవరం మీకు కాల్ చేయలేదు సర్ అసలు మేరెక్కడ ఉన్నారో మాకు తెలియదని వాళ్ళు చెప్తారు. దాంతో అదంతా ట్రాప్ అని అర్థం చేసుకున్న ఓజ్లర్ వెంటనే ఆ అతని ఉండే కాటేజీకి వెళ్తాడు. అప్పటికే అతని భార్య, కూతురు కనపడకుండా పోతారు. ఇక కళ్ళు తెరచి ల్యాప్ టాప్ లోని మర్డరర్ వాంగ్మూలం విని ఆశ్చర్యపోతాడు. మరోవైపు సిటోలో వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు ఓజ్లర్ భార్య, కూతురు ఏమయ్యారు? మర్డరర్ చెప్పేది నిజమేనా ? ఆ వరుస హత్యలు చేస్తుందెవరో ఓజ్లర్ కనిపెట్టాడా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:-
ఓ కాటేజ్ లో భార్య, కూతురు కనపడకుండా పోతారు. మరి ఓజ్లర్ ఏం చేస్తాడనే ఇంటెన్స్ తో కథ ఆసక్తిగా మొదలైంది. అయితే తన. భార్య, కూతురిని చంపేశానని మర్డరర్ చెప్పడంతో అది నిజమేనా కాదా అని ఓజ్లర్ ఇన్వెస్టిగేషన్ చేయడం.. అదే సమయంలో సిటీలో జరుగుతున్న వరుస హత్యల వెనుక ఉందెవరో ఒక్కో క్లూతో ఓజ్లర్ కనిపెట్టే సీన్స్ ఉత్కంఠభరితంగా సాగుతాయి.
అయితే ఫస్టాఫ్ లోనే కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. వరుసగా హత్యలు జరగడం.. ప్రతీ హత్య దగ్గర హ్యాపీ బర్త్ డే అని రాసి ఉండటం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకి కాంప్లెక్సిటి పెరిగిపోవడం బాగుంటుంది. అయితే ఒకానొక దశలో క్రిమినల్ అదే పనిగా హాత్యలు చేస్తుంటే ఈ పోలీసులు ఏం చేయరా అనే అసహనం ప్రేక్షకులలో కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని ఓ కన్ క్లూజన్ కి వచ్చేలా చేస్తుంది. అయితే అసలు కథ అప్పుడే మొదలైందన్నట్టుగా దర్శకుడు చూపించాడు.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు కాస్త ల్యాగ్ అనిపించినా కథ గ్రిస్పింగ్ గా ఉండటంతో అది ప్రతీ ఒక్కరికి నచ్చేస్తుంది. విలన్ కి జరిగిన అన్యాయాన్ని ఎవరు ప్రతిఘటించకపోవడంతో పాటు తనని దోషిలా చూడడంతో అతను చేస్తున్న మారణకాండ రివీల్ అవుతుంది. అయితే ఓజ్లర్ కి అంతుచిక్కని ప్రశ్నలు చాలానే ఉంటాయి. జైలులో ఉన్న ఓ ఖైదీ ఎలా విలన్ గురించి చెప్పగలడు.. అసలు తన భార్య, కూతురు నిజంగానే చనిపోయారా లాంటి ప్రశ్నలు అందరిలోనూ కలుగుతాయి . అయితే వీటిని చూపించకుండా మరో పార్ట్ ఉంటుందంటూ మేకర్స్ కథని కొనసాగించారు.
కథలో ఎక్కడా కూడా అడల్ట్ సీన్స్ లేవు. క్రైమ్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం, ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా థ్రిల్ ని పంచుతాయి. తెనీ ఈశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సమీర్ మహమ్మద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. మిథున్ ముకుందన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే బిజిఎమ్ అందరికి కనెక్ట్ అవుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:-
ఏసీపీ అబ్రహం ఓజ్లర్ గా జయరామన్ ఒదిగిపోయాడు. డాక్టర్ అలెగ్జాండర్ జోసెఫ్ పాత్రలో మమ్ముట్టి ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : -
క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడేవారికి ఇది నచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్ : 3/5
✍️. దాసరి మల్లేశ్