English | Telugu

సైలెంట్ గా వైఎస్ వివేకా బయోపిక్ పూర్తి.. రాజకీయ ప్రకంపనలేనా!

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించింది. మొదట ఇది గుండెపోటుగా ప్రచారం పొందింది. ఆ తర్వాత ఆయనను గొడ్డలితో దారుణంగా హత్య చేశారనే విషయం బయటపడింది. అయితే ఈ దారుణ హత్య వెనుక అయినవాళ్లే ఉన్నారంటూ వివేకా కుమార్తె సునీత చాలారోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. ఈ క్రమంలో వైఎస్ వివేకా బయోపిక్ తెరమీదకు రావడం సంచలనంగా మారింది.

'వివేకం' పేరుతో వైఎస్ వివేకా బయోపిక్ రూపొందింది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఎవరనే విషయం రివీల్ కాలేదు కానీ.. 'వివేకా బయోపిక్' అనే యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్ ను విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ కింద డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు. వివేకా హత్యకు ముందు తర్వాత జరిగిన సంఘటనలను చూపిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. అంతేకాదు ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడంలేదు. 'www.vivekabiopic.com' అనే వెబ్ సైట్ ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఎన్నికలకు ముందు ఈ బయోపిక్ ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.