English | Telugu

మహేష్ బాబు  డాన్స్ అంటే పిచ్చి..మగధీర చూసా కదా

ఆయనొక స్టార్ క్రికెటర్.. ఎన్నో సార్లు భారత క్రికెట్ టీం ని తన అద్భుతమైన బౌలింగ్ తో గెలిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్ తోను ప్రత్యర్దులకి చుక్కలు చూపించాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు అశ్విన్ రవి చంద్రన్. తాజాగా ఆయన మన తెలుగు సూపర్ స్టార్ గురించి మాట్లాడటం ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది.

ట్విట్టర్ వేదికగా అశ్విన్ ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. గుంటూరు కారం సినిమా చూశానని అందులో ని పాటలు తనకి చాలా ఇష్టమని చెప్పాడు. మహేష్ బాబు డాన్స్ కూడా చాలా నచ్చిందని చెప్పాడు. అశ్విన్ చెప్పిన ఈ మాటలు విన్నమహేష్ ఫ్యాన్స్ అయితే మహేష్ రేంజ్ గ్లోబల్ స్థాయి అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు. శ్రీ లీల డాన్స్ కూడా నచ్చిందని అలాగే తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూస్తానని చెప్పాడు.


ఇక గతంలో కూడా మగధీర మూవీ నచ్చిందని అశ్విన్ చెప్పడం గమనార్హం. ఇక తన క్రికెట్ కెరీర్ లో ఇప్పటి వరకు 100 టెస్ట్ మ్యాచ్ లాడి 500 వికెట్ లు తీసాడు. 116 వన్ డే లు ఆడి 156 వికెట్లు తీసాడు. ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ల్లోకూడా రాణిస్తున్నాడు. 5 వికెట్స్ లని 36 సార్లు 10 వికెట్స్ లని 8 సార్లు సాధించాడు. 2010 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. చివరి వన్ డే ని 2023 లో ఆస్ట్రేలియా మీద ఆడాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.