Read more!

English | Telugu

తెలుగు తెరపై మరో మలయాళ మూవీ వస్తుందా! నిన్న అక్కడ హిట్  

ఈ సంవత్సర ప్రారంభం నుంచే తెలుగు  సినీ ప్రేమికులని మలయాళ చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. థియేటర్ లో  మలయాళ  చిత్రం ఉందంటే చాలు ఆ సినిమా గురించి ఎంక్వయిరీ చేసే పరిస్థితి. ఇప్పటికే భ్రమయుగం,ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ది  గోట్ లైఫ్ చిత్రాలు వచ్చి ఘన విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో మూవీ చేరే అవకాశాలు కనపడుతున్నాయి.

వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ (fahadh faasil)హీరోగా ఈ నెల 11 న కేరళలో విడుదల అయిన మూవీ ఆవేశం (aavesham) మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. మూవీలోని ఫహద్ యాక్టింగ్ కి  ప్రతి ఒక్కళ్ళు ఫిదా అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు జీతూ మాధవన్(jithu madhavan) ఎంతో పవర్ ఫుల్ గా చిత్రీకరించారని అంటున్నారు. గతంలో ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మలయాళ దృశ్యం కి ఈయనే దర్శకుడు.

20 కోట్ల బడ్జట్ తో ఫాహద్ అండ్  ప్రముఖ హీరోయిన్ నజ్రియా లు  ఆవేశాన్ని నిర్మించారు. వీళ్లిద్దరు భార్యభర్తలు అనే విషయం  అందరకి తెలిసిందే. ఆశిష్ విద్యార్థి, మన్సూర్ అలీఖాన్, ప్రణవ్ రాజ్ తదితరులు ముఖ్య  పాత్రలు పోషించారు.తెలుగు నాట ప్రస్తుతం  మలయాళ సినిమా  హంగామా నడుస్తున్న నేపథ్యంలో ఆవేశం  తెలుగులో కూడా విడుదల అవ్వచ్చు. ఫాహద్ కి విక్రమ్, పుష్ప సినిమాలతో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.రీసెంట్ హిట్ ప్రేమలు కి ఫాహద్  ఒక  నిర్మాతగా కూడా  వ్యవహరించాడు