Read more!

English | Telugu

‘కల్లు కాంపౌండ్‌ 1995’ ట్రైలర్‌ లాంచ్‌

ఎంటర్టైన్మెంట్‌ తోపాటు.. మంచి మెసేజ్‌ ఇస్తే సినిమాను ప్రేక్షకులు సూపర్‌ హిట్‌ చేస్తారు. అలాంటి కోవలో రాబోతున్న మూవీ ‘కల్లు కాంపౌండ్‌ 1995’. గణేష్‌, ఆయూషి పటేల్‌ జంటగా బ్లూ హారీజోన్‌ మూవీ ప్యాక్టరీ బ్యానర్‌ పై ప్రవీణ్‌ జెట్టి దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ‘కల్లు కాంపౌండ్‌ 1995’. పోసాని కృష్ణమురళి, జీవా, ప్రవీణ్‌, బాలచందర్‌, గౌతమ్‌ రాజు, చిట్టి బాబు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బుర్రా మల్లేష్‌ గౌడ్‌ (బొట్టు), శ్రీమతి హారిక జెట్టి, శ్రీమతి పిట్ల విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ హైద్రాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన తమ్మారెడ్డి  భరద్వాజ ఈ మూవీ ట్రైలర్‌ ను లాంచ్‌ చేశారు. 

హీరో గణేష్‌ మాట్లాడుతూ.. నేను పుట్టి, పెరిగింది బెంగుళూరు. కన్నడలో చాలా సినిమాలలో నటించాను. సోషల్‌ మీడియాలో ఆర్టిస్ట్‌ ల కోసం చూస్తుంటే జస్ట్‌  ఫార్వర్డ్‌ చేశాను. కథకు సరిగ్గా సరిపోతానని నమ్మి ఎటువంటి ఆడిషన్‌ లేకుండా నాతో సినిమా చేశారు దర్శక నిర్మాతలు. సినిమా చాలా బాగా వచ్చింది. 24 క్రాఫ్ట్స్‌ ఉన్న టెక్నిషియన్స్‌ సపోర్ట్‌ వల్ల సినిమాను సక్సెస్‌ ఫుల్‌ గా పూర్తి చేసామని అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రవీణ్‌ జెట్టి మాట్లాడుతూ... కల్లు కాంపౌండ్‌ 1995 స్టోరీ డిఫరెంట్‌ గా ఉంటుంది. ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలగాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాము. మంచి స్టోరీ చెప్పడమే కాదు. మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమా ద్వారా చెప్పాము. మా సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ చూసి సీనియర్‌ టెక్నిషియన్స్‌ మొచ్చుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. మా టెక్నిషియన్స్‌ అందరి సపోర్ట్‌ తో సినిమా సక్సెస్‌ ఫుల్‌ గా బెటర్‌ అవుట్‌ పుట్‌ తీసుకోనిరాగలిగాం.. ఇది అన్ని వర్గాలకు నచ్చుతుందని అన్నారు.