Read more!

English | Telugu

మూకీ చిత్రం ‘కావ్య రాజ్‌’  ట్రైలర్‌ విడుదల.! 

గజగౌని ప్రొడక్షన్‌ పతాకంపై, కవిత రాజ్‌పుత్‌, జమున, అంజలి, మధు, హీరో హీరోయిన్లుగా మధులింగాల దర్శకత్వంలో నిర్మాత గజగౌని దయానంద్‌ గౌడ్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కావ్యరాజ్‌’. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ చేయడం జరిగింది. ముఖ్య  అతిథిగా  ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రెటరీ ప్రసన్నకుమార్‌ విచ్చేసి ట్రైలర్‌ను  ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రావణలంక హీరో క్రిష్‌, కొరియోగ్రాఫర్‌ కట్ల రాజేంద్రప్రసాద్‌, మధుకర్‌రెడ్డి,  చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గజగౌని శివాంశ్‌గౌడ్‌, కంచర్ల లక్ష్మికాత్యాయిని, శ్రీభరణి, మల్లికార్జున్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ  సందర్భంగా నిర్మాత దయానంద్‌  మాట్లాడుతూ ‘ఇది మామూలు సినిమా కాదు. తెలంగాణ మొట్టమొదటి మూకీ చిత్రం. ఈ చిత్రాన్ని  పైడి జయరాజుగారికి అంకితం ఇస్తున్నాం. ఎందుకంటే భారత సినీ రంగంలో కరీంనగర్‌కు చెందిన తెలంగాణ నటుడు, నిర్మాత, దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత  పైడి జయరాజు గారికి సరైన గౌరవం దక్కలేదని నేను చింతిస్తూ, ఈ సినిమాను పైడి జయరాజు గారికి అంకితం ఇస్తున్నాను. దాదాపుగా 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సామాన్యుడిగా నిలిచి తెలంగాణ నేల నుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన పైడి జయరాజ్‌ గారిని, ఈ విధంగా సత్కరించుకోవడం అనేది నాకు గర్వకారణం’ అన్నారు.

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ  ‘దయానంద్‌గారు పైడి జైరాజ్‌గారిని ఆదర్శంగా తీసుకుని ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. దయానంద్‌గారు వాట్సాప్‌ గౌడ గ్రూపులో వున్న వారిని ఒక టీమ్‌గా  ఏర్పాటు చేసి ఈ చిత్రం నిర్మించడం సంతోషదాయకం. చాలా కాలం తర్వాత  మంచి మూకీ సినిమా రాబోతుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.