English | Telugu

తెలుగునాట వార్-2 బెనిఫిట్ షోలు.. మొదటి రోజు మాస్ జాతరే!

ఇండియన్ సినిమాలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో ఒకటి 'వార్-2'. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ మూవీ.. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భారీ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. (War 2)

'వార్-2'ను తెలుగునాట సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం సితార సంస్థ రూ.80 కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర'ను కూడా తెలుగునాట సితారే విడుదల చేసి, మంచి లాభాలను పొందింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు 'వార్-2'ని కూడా భారీస్థాయిలో విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు ప్లాన్ చేస్తున్నారట. పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా సంచలన ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం.

'వార్-2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం(ఆగస్టు 10) హైదరాబాద్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, హృతిక్ హాజరు కానున్నారు. బుకింగ్స్ కూడా ఆదివారం నాడే ఓపెన్ కానున్నాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం