English | Telugu

ప్రభాస్ మామూలోడు కాదు.. సైలెంట్ గా ఇంత చేశాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'ది రాజా సాబ్', 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. రాజా సాబ్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 'ఫౌజి' షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఫౌజి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్.. పెద్దగా హడావుడి లేకుండా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ప్రభాస్ మరో 30 రోజులు కేటాయిస్తే.. ఆయన పార్ట్ పూర్తవుతుందని సమాచారం. ప్రభాస్ లేని సన్నివేశాల చిత్రీకరణకు మరో 20 రోజులు పట్టే అవకాశముంది అంటున్నారు.

ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్లు ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలు చేయడం అరుదైపోయింది. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఓ వైపు 'రాజా సాబ్' చేస్తూ.. మరోవైపు 'ఫౌజి' షూటింగ్ ఇంత పూర్తి చేయడం మామూలు విషయం కాదు. 'ఫౌజి' చిత్రాన్ని 2026, ఏప్రిల్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం