English | Telugu

రిస్కు చేస్తున్న చిరంజీవి..డూప్ వద్దన్నాడు

మెగాస్టార్ చిరంజీవి.. తన డాన్సులతో ఫైట్ లతో తెలుగు సినిమాని పరుగులు పెట్టించిన మగధీరుడు. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమయిన తన సినీ ప్రస్థానంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. సృష్టిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ పనిలో భాగంగానే తన నయా మూవీ విశ్వంభర షూటింగ్ లో ఉన్నాడు. అందులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం చిరు మీద పలు యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. పూర్తిగా బురద నీటిలో జరుగుతున్న ఈ షూట్ లో చిరు ఎలాంటి డూప్ లేకుండా చేస్తున్నాడు. డూప్ ని పెడదామని మేకర్స్ చెప్పినా కూడా చిరు నే చేస్తున్నాడు. ఆ యాక్షన్ సీన్స్ అన్ని కూడా రిస్క్ తో కూడుకున్నవని తెలుస్తుంది. నిజానికి చాలా మంది హీరోలు రిస్కీ షాట్స్ చెయ్యరు.పైగా మేకర్స్ కూడా రిస్కీ షాట్స్ వల్ల హీరోలకి ఇబ్బంది కలుగుతుందేమోనని డూప్ లకే మొగ్గు చూపుతారు. ఇక చిరు రిస్కీ షాట్స్ గురించి సోషల్ మీడియాలో ప్రసారమవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే చిరంజీవి కి ఇప్పుడు 60 ప్లస్. ఏది ఏమైనా ఈ వయసులో కూడా సినిమా పట్ల చిరుకి ఉన్న కమిట్ మెంట్ ని అభినందించ దగ్గ విషయమే.

ఇక విశ్వంభర పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చిరు కూడా భోళాశంకర్ ప్లాప్ తో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు కాగా యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది. ముగ్గురు హీరోయిన్ లకి స్కోప్ ఉండగా త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుంది. 2025 జనవరి 10 న మూవీ విడుదల కానుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం