English | Telugu

అల్లు అర్జున్ రేర్ రికార్డు.. సౌత్ లోనే నెంబర్ వన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే 'పుష్ప' సినిమా వచ్చిందో.. ఒక్కసారిగా ఆయన రేంజ్ మారిపోయింది. నేషనల్ వైడ్ గా బన్నీని అభిమానించే వారు రోజురోజుకి పెరిగిపోతున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయన ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ విషయంలో.. సౌత్ స్టార్స్ లోనే టాప్ పొజిషన్ లో బన్నీ నిలిచాడు.

ఇన్‌స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు అల్లు అర్జున్. ఆయన ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్ల మార్క్ ని దాటేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ స్టార్ బన్నీనే కావడం విశేషం. తర్వాతి స్థానాల్లో 21 మిలియన్ ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండ, 20 మిలియన్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ ఉన్నారు.

మిగతా స్టార్స్ తో పోలిస్తే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. సినిమా అప్డేట్స్ తో పాటు.. తన పిల్లలు అయాన్, అర్హలకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటాడు కాబట్టే.. బన్నీను అభిమానించే వారి సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్ మార్క్ ని అందుకోవడంతో అందరికీ థాంక్యూ చెబుతూ బన్నీ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప-2'లో నటిస్తున్నాడు. దీనిని ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే బన్నీ క్రేజ్ ఆకాశాన్నంటుతుంది అనడంలో సందేహం లేదు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం