English | Telugu

నిరూపిస్తే నేను సినిమాలు మానేస్తాను..గొర్రెల లెక్క కరెక్ట్ గానే ఉంటుంది

విశ్వక్ సేన్(VishwakSen)హీరోగా తెరకెక్కిన మూవీ 'లైలా'(Laila)ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యి,చిత్ర బృందానికి తన ఆశీస్సులు అందచేయడంతో పాటుగా,మూవీ విజయం సాధించాలని కూడా కోరుకున్నాడు.ఇక ఇదే ఈవెంట్ లో లైలాలో ఒక క్యారక్టర్ ని పోషించిన ప్రముఖ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతు మూవీలో విలన్ నన్ను తీసుకురమ్మంటే వాళ్ళ మనుషులు వచ్చి నన్ను తీసుకెళ్తారు.అప్పుడు నా దగ్గర ఉన్న మేకల్ని లెక్కపెడితే,కరెక్ట్ గా 150 మేకలు ఉంటాయి.ఆ తర్వాత చివరికి నన్ను రిలీజ్ చేసేటప్పుడు లెక్కపెడితే మాత్రం పదకొండు మేకలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.ఈ మాటలు వైసిపీ ని ఉద్దేశించి చేసాడని,లైలా మూవీని బాయ్ కాట్ చెయ్యాలంటూ కొంత మంది వైసిపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు

ఇప్పుడు ఈ విషయంపై విశ్వక్ సేన్ మాట్లాడుతు కొంత మంది సోషల్ మీడియాలో బాయ్స్ గెట్ రెడీ బాయ్ క్యాట్ లైలా అని 25000 ట్వీట్ లు చేసారు.100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని ఎలిమినేట్ చేసేద్దామా,ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఇంకా రిలీజ్ కానీ మా సినిమాని చంపేయకండి.,సినిమావాళ్ళంటే ఒక టైం కి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా,ఆ మాట్లాడిన వ్యక్తి అంత అనుభవం ఉండదు నాది.ఆ వ్యక్తి స్టేజ్ పై మాట్లాడుతున్నప్పుడు, నేను గాని ప్రొడ్యూసర్ గాని అక్కడ లేం.చిరంజీవి గారు వస్తున్నారని తెలిసి బయటకెళ్ళాం.ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు,నేను ఎదురుగా ఉండి ఉంటే,మైక్ లాక్కొనే వాడ్ని, లైవ్ కెమెరాలు ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి,నేను అక్కడ ఉంటే కనుక సినిమాలు మానేసి వెళ్ళిపోతాను. ఈవెంట్ అయిపోయాక,ఇంటికెళ్ళాక గాని ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో మాకు తెలియలేదు.

సినిమాలో అతను స్టేజ్ పై చెప్పిన డైలాగ్ లేదు.అతను ఉన్నప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో, చివరి దాకా కూడా అన్నే గొర్రెలు ఉంటాయి.అతను మాట్లాడిన మాటలకి మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు.అతని మీద కోపాన్ని మా సినిమా మీద చూపించడం కరెక్ట్ కాదు.సినిమా కోసం చాలామంది కష్టపడ్డాం.సినిమాని బయటకి రాకముందే చంపేయకండి,ఆ వ్యక్తి మా సినిమా కాబట్టి జరిగిన దానికి సారీ అని చెప్పుకొచ్చాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.