English | Telugu

ఒక్క దెబ్బతో 500 కోట్ల రైటరయ్యాడు!!

అతను రాసిన కథలు తెలుగులో సూపర్ హిట్లయ్యాయి, బ్లాక్ బ్లాస్టర్లు గా నిలిచాయి, కొత్త రికార్డులు సృష్టించాయి కానీ అప్పుడు అతని కి రాని గుర్తింపు రెండు కథలతో వచ్చేసింది. అతను ఎవరో కాదు తెలుగు సినిమా సక్సెస్ ఫుల్ స్టొరీ రైటర్ కే. విజయేంద్రప్రసాద్. మన దర్శకధీరుడు రాజమౌళి ఫాదర్.

ఆయన రాసిన రెండు కథలు 'బాహుబలి'..'భజరంగి భాయ్ జాన్' లు ఆయన్ని మోస్ట్ వాంటెడ్ ఇండియన్ స్టొరీ రైటర్ లిస్ట్ లో చేర్చాయి. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమా రికార్డులను తుడిచిపెట్టి 350 కోట్ల గ్రాస్ సాధించగా, రంజాన్ కానుకగా రిలీజైన సల్మాన్ ఖాన్ 'భజరంగి భాయ్ జాన్' రికార్డులను సృష్టిస్తూ కేవలం మూడు రోజులో 100 కోట్లకు పైగా వసూళ్ళను సాధించి౦ది.

'భజరంగి భాయ్ జాన్' అయితే సల్మాన్ ఖాన్ కేరియాలో బెస్ట్ మూవీగా ఫిల్మ్ క్రిటిక్స్ ముద్ర వేశారు. సల్మాన్ మాత్రం ఈ క్రెడిట్ అంతా స్టొరీ రైటర్ విజయేంద్రప్రసాద్ కే దక్కాలని చెప్పడం విశేషం. ఈ రెండు సినిమాల సక్సెస్ దెబ్బకి ఏ నేషనల్ మీడియా ఛానెల్ చూసిన విజయేంద్రప్రసాద్ గురించే చర్చిస్తున్నారు. 500 కోట్ల రైటర౦టూ తెగ పొగిడేస్తున్నారు. దీంతో మన తెలుగువారు తెగ సంబరపడిపోతున్నారు. కొడుకు రాజమౌళి 300 కోట్ల దర్శకుడైతే..తండ్రి 500 కోట్ల రైటరయ్యాడని హ్యాపీగా ఫీలవుతున్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.