English | Telugu

బాహుబ‌లికి బ‌లైంది.. ప్ర‌భాసేనా?

ప్ర‌భాస్ గురించి ఎవ‌రైనా ఏం చెబుతారు? డీసెంట్‌, సైలెంట్ అంటారు. క‌థానాయిక‌లైతే సిగ్గెక్కువ అని చెప్తారు. చాలామంది ప్ర‌భాస్ కి భ‌లే మొహ‌మాట‌మండీ అనేస్తారు..! ఆ మొహ‌మాట‌మే ఇప్పుడు ప్ర‌భాస్ కొంప ముంచుతోంది. అందునా.. బాహుబ‌లి విష‌యంలో. ఔను... బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ చేసింది అంతా ఇంతా కాదు. కానీ క్రెడిట్ మాత్రం రాజ‌మౌళి ఖాతాలోకి జ‌మైపోతోంది. మిర్చిలాంటి ప‌వ‌ర్‌ఫుల్ హిట్ త‌ర‌వాత‌.. ఏ క‌థానాయ‌కుడూ ఓ సినిమా కోసం మూడేళ్ల స‌మ‌యం వెచ్చించ‌డు. ఎందుకంటే ఆ మూడేళ్ల‌లో ఆరు సినిమాలు చేసుకొన్నా... అటు ఆర్థికంగా, ఇటు కెరీర్ ప‌రంగా తిరుగులేని స్థాయికి చేరుకోవచ్చు. కానీ ఈ రెండింటినీ ప్ర‌భాస్ ప‌క్క‌న పెట్టేసి - బాహుబ‌లి కోస‌మే శ్ర‌మించాడు. ఇప్పుడు అత‌ని క‌ష్టం ఫ‌లించింది, సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కానీ క్రెడిట్ మాత్రం రాజ‌మౌళి ఖాతాలో చేరిపోతోందన్న‌ది అత‌ని అభిమానుల ఆవేద‌న‌.

అదీ నిజ‌మే. ప్ర‌భాస్ కూడా ఈ సినిమా రాజ‌మౌళి సినిమాగానే ప్ర‌మోట్ చేయాల‌నుకొన్నాడు. ఎక్క‌డా త‌న డ‌బ్బా తాను కొట్టుకోలేదు. అంతా నేనే చేశా.. ఈ సినిమా అంతా నాక‌ష్ట‌మే అని అస్స‌లు చెప్పుకోలేదు.రాజ‌మౌళి ప‌డిన క‌ష్టం ముందు నాదెంత‌..?? అన్నాడు. అందుక‌నేనేమో ఇప్పుడు క్రెడిట్ కూడా పూర్తిగా రాజ‌మౌళి కే వెళ్లిపోతోంది. ప్ర‌భాస్ కి ఈసినిమా ద్వారా ల‌భించింది ఏమిటి? ఏం సాధించాడు? అంటే మాత్రం నిరాశ‌జ‌న‌క‌మైన స‌మాధానాలే ల‌భిస్తాయి. సినిమా మొత్తంలో ప్ర‌భాస్‌నీ ప్ర‌భాస్ బాడీని.. అత‌ని పెర్‌ఫార్మ్సెన్ లెవెల్స్‌ని రాజ‌మౌళి స‌రిగా ఎన్‌హాన్స్ చేయ‌లేక‌పోయాడ‌న్న విమ‌ర్శ ఉంది. అది ప్ర‌భాస్ అభిమానులూ గుర్తించారు. ఈ సినిమా కోసం ప్ర‌భాస్‌కి త‌న అభిమానుల‌కూ మూడేళ్లు అడ్డుగోడ‌లా నిలిచాడు రాజ‌మౌళి. ఆ బాధ‌... అభిమానుల‌కూ తెలుసు. ప్ర‌భాస్ బ‌య‌ట‌కు వెళ్తే.. లుక్ ఎక్కడ తెలిసిపోతుందో అని.. రాజ‌మౌళి భ‌యం. కాద‌న‌లేం. కానీ.. ఓ అగ్ర క‌థానాయ‌కుడ్ని ఆల్ మోస్ట్ బంధించేశాడు జ‌క్కన్న‌.

పోనీ ఈ సినిమాతో ప్ర‌భాస్ కి ఫుల్లుగా క్రెడిట్ వ‌చ్చేసిందా అంటే... అదీ లేదు. ఇది ఇంటా బ‌య‌టా రాజ‌మౌళి సినిమాలానే చ‌లామ‌ణీ అవుతోంది. క‌థానాయ‌కులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సినీ రాజ‌కీయ సెల‌బ్రెటీలు చేసే వ్యాఖ్య‌ల్లోనూ ప్ర‌భాస్ పేరే లేదు. దానికి తోడు చిత్ర‌బృందం.. రాజ‌మౌళి పీఆర్ వ్య‌వ‌స్థ కూడా ఈ సినిమా క్రెడిట్ అంతా రాజ‌మౌళికే చెందాల‌న్న త‌ప‌న‌తో ప‌నిచేస్తోంది. పోనీ... పారితోషిక‌మైనా భారీగా ఇచ్చారా అంటే... ఈ సినిమా కోసం ప్ర‌భాస్ రూ.24 కోట్లు అందుకొన్నాడ‌ని టాక్‌. మిర్చి స‌మ‌యానికే ప్ర‌భాస్ ఒక్కో సినిమాకీ దాదాపుగా రూ.10 కోట్లు అందుకొంటున్నాడు. మూడేళ్ల‌లో ఆరు సినిమాలు చేస్తాడ‌నుకొంటే అందుకు గానూ అత‌నికి రూ60 కోట్ల‌యినా ద‌క్కుండేవి. అంటే... పారితోషికం ప‌రంగానూ ప్ర‌భాస్‌కి హ్యాండిచ్చిన‌ట్టే లెక్క‌. దానికి తోడు బాలీవుడ్‌లో ఈ సినిమా రానా పేరుతో చ‌లామ‌ణీ అవుతోంది. రాజ‌మౌళి కూడా ఇది రానా సినిమాగానే అక్క‌డ ప్ర‌మోట్ చేశాడు. దాంతో హిందీ సీమ‌లోనూ ప్ర‌భాస్ క‌ష్టానికి త‌గిన గుర్తింపు దక్క‌కుండా చేశాడ‌ని అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు.

రాజమౌళి ఎవ‌రితో సినిమా చేసినా క్రెడిట్ పూర్తిగా త‌న ఖాతాలోకే మ‌ళ్లేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడ‌ని గ‌త సినిమాలు రుజువు చేశాయి. అఫ్ కోర్స్‌.. రాజ‌మౌళి కూడా త‌న సినిమాల‌కు అలానే సోలోగా క‌ష్ట‌ప‌డేవాడు. కానీ బాహుబ‌లి సోలో ఎఫెక్ట్ కాదు. అందులో అంద‌రికీ వాటా ఉంది. ముఖ్యంగా ప్ర‌భాస్ క‌ష్టం క‌నిపిస్తోంది. ఇలాంట‌ప్పుడు ప్ర‌భాస్‌కీ ఆ క్రెడిట్ ద‌క్కాల‌నుకోవ‌డంలో త‌ప్పేం లేదు క‌దా..? ఈ విష‌యంలోనే ప్ర‌భాస్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఈ సంగ‌తి.. ప్ర‌భాస్ వ‌ర‌కూ చేరింద‌ని, ప్ర‌భాస్ కూడా దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగ‌బోతున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. బాహుబ‌లి 2 విష‌యంలో ఈ త‌ప్పులేం జ‌ర‌క్కుండా చూసుకోవాల‌ని చూస్తున్నాడ‌ట‌. ఈ విష‌యంలో ప్ర‌భాస్ ఎంత వ‌ర‌కూ స‌క్సీడ్ అవుతాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.