English | Telugu

మెగా హీరోకు టైటిల్ కుదిరింది

నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ సినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. గత కొంతకాలంగా ఈ సినిమా పేరు గొల్లభామగా ప్రచారం జరిగినప్పటికీ ఆ టైటిల్ ఈ సినిమాకు సెట్ కాదని ‘ముకుంద’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న విడుదల చేయనున్నారు. సీతమ్మ వాకిట్లో, కొత్తబంగారు లోకం ఫేం శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఠాగూర్ మధు - నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. పూజా‌హెగ్డే హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమా ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ 45 లక్షలకు తీసుకున్నట్టు టాక్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.