English | Telugu

ఇది పక్కా..'కంచె' వాయిదా పడింది

వరుజ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’ రిలీజ్ వాయిదా పడుతుందేమోనని ఈ రోజు వచ్చిన రూమర్లు నిజమయ్యాయి. ‘కంచె’ను అక్టోబరు 2 నుంచి నవంబరుకు వాయిదా వేస్తున్న సంగతి అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు. హీరో వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు. తమ సినిమా నవంబరు 6కు వాయిదా పడినట్లు చెప్పిన వరుణ్ తేజ్.. దీనికి కారణమేంటో తర్వాత వెల్లడిస్తామని చెప్పాడు. అయితే కంచె వాయిదాకు గల కారణాలు మాత్రం ఇంకా తెలిసిరాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఏమైనా లేటవుతోందా అనుకుందామంటే అలాంటి సూచనలేం కనిపించలేదు. అంత భారీ సినిమాను శరవేగంగా పూర్తి చేసిన క్రిష్ చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నాడు. అంతా సాఫీగానే సాగుతున్నట్లు అనిపిస్తోంది. మరి సినిమాను ఎందుకు వాయిదా వేశారో దర్శకుడు క్రిష్ చెబితేనే తెలుస్తోంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.