English | Telugu

కందిరీగలో వి.వి.వినాయక్ వాయిస్ ఓవర్

కందిరీగలో వి.వి.వినాయక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, చురుకైన యువహీరో రామ్ హీరోగా, అందాల ముంబాయి ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "కందిరీగ". ఈ "కందిరీగ" చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నారు.

విలన్ గా నటిస్తున్న సోనూ పాత్రను పరిచయం చేయటానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. గతంలో ఇలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "జల్సా" చిత్రానికి ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్‍ హీరోగా నటించిన "వరుడు" చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి, రమ్ హీరోగా నటించిన "రామరామ కృష్ణకృష్ణ" చిత్రానికి యంగ్ టైగర్ యన్ టి ఆర్, అనుష్క ప్రథాన పాత్రలో నటించిన "పంచాక్షరి" చిత్రానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. కానీ వీటిలో ఒక్క పవన్ హీరోగా నటించిన "జల్సా" చిత్రం మాత్రమే ఘనవిజయం సాధించటం విశేషం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.