English | Telugu

పవన్ కళ్యాణ్ ని యోగి ఆదిత్యనాధ్ తో పోలుస్తున్న కృష్ణవంశీ 

దర్శకుడుగా కృష్ణవంశీ(krishna vamsi)కి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నిన్నే పెళ్లాడుతా దగ్గర్నుంచి రంగ మార్తాండ వరకు ఆయన టచ్ చెయ్యని జోనర్ లేదు.పైగా వాటన్నిటిలోను భారీ హిట్స్ ని అందుకొని సుదీర్ఘ కాలం నుంచి టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతు వస్తున్నాడు.రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వన్ మాన్ షో మురారి(murari)రీ రిలీజ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి కృష్ణవంశీ స్టామినాని మరోసారి అందరికి గుర్తు చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ అభిమానులు వేసే ప్రశ్నలకి చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్తుంటాడు.రీసెంట్ గా ఒక అభిమాని ప్రస్తుతం తిరుపతి లడ్డు(tirupati laddu)విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)తీసుకున్న స్టాండ్ గురించి మీ అభిప్రాయమేంటని అడగగా మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి.పవన్ లాంటి వాళ్ళు మరింత మంది రాజకీయాల్లోకి రావాలి.అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఒక వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు.అందుకు భగవంతుడు ఆయనకి ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజం ఎప్పటికైనా నిజమే.

దానికి ఎవరి అంగీకారం అవసరం లేదు.పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరో అని మరోసారి రుజువయ్యింది.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్(Yogi Adityanath)తర్వాత అంతటి విలువలు, తెలివి తేటలు కల్గిన ప్రత్యేక రాజకీయవేత్త పవన్ అని చెప్పుకొచ్చాడు.దీంతో పవన్ అభిమానులైతే కృష్ణవంశీ నాలుక మీద మచ్చ ఉంటే బాగుండని కోరుకుంటున్నారు.నాలుక మీద మచ్చ ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు నిజమవుతాయనే నానుడి ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.