English | Telugu

ప్రభాస్ దెబ్బకి జైలుకి వెళ్లిన ఇద్దరు

ఇక ఇండియాలో సలార్ మానియా ప్రారంభం అయ్యింది. డిసెంబర్ నెల మొత్తం సలార్ నెలగా మారబోతుంది. 1 న ట్రైలర్ రిలీజ్ 22 సినిమా ఇలా డిసెంబర్ నెల సలార్ నెలగా రూపాంతరం చెందనుంది. అలాగే రోజు సోషల్ మీడియాలో సలార్ కి సంబంధించిన వార్త ఏదో ఒకటి రాకపోతే ఆ రోజు సోషల్ మీడియా కి పొద్దుపొడవని పరిస్థితి. ఇప్పుడు సలార్ కి సంబంధించిన తాజా వార్త మరోసారి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

తాజాగా సలార్ సినిమా విషయంలో పోలీసు లు ఇద్దర్ని అరెస్ట్ చేసారు.సలార్ కంటెంట్ ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసు లు ఆ ఇద్దర్నిఅరెస్ట్ చేసారు. గత కొన్ని రోజులుగా కొంత మంది సలార్ మూవీ కి సంబంధించిన కంటెంట్ ని సోషల్ మీడియాలో లీక్ చెయ్యడం లాంటివి చేస్తున్నారు. అలా లీక్ అయిన కంటెంట్ ని కొంత మంది తమకి ఇష్టమొచ్చిన రీతిలో తమ యు ట్యూబ్ ఛానెల్స్ లో స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ రంగంలో కి దిగి సలార్ విషయంలో ఎవరైనా ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేసారు.

బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ కి రాలేదని డార్లింగ్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహం లో ఉన్నారు. ఇప్పడు వాళ్ళ ఆశలన్నీ సలార్ మీదనే ఉన్నాయి. సలార్ సినిమా ద్వారా ప్రభాస్ బాహుబలి రికార్డులని బద్దలు కొడతాడనే గట్టి నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.