English | Telugu
ఎన్టీఆర్ సరసన మరో బాలీవుడ్ యంగ్ బ్యూటీ!
Updated : Nov 18, 2023
'వార్ 2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందనున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించనున్నాడు. ఇద్దరు బడా స్టార్లు కలిసి నటించనున్న చిత్రం కావడంతో 'వార్ 2'పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన 'టైగర్ 3' మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో 'వార్ 2'లో జూనియర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో హింట్ ఇవ్వడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
'వార్ 2'లో తారక్ కి జోడిగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరి వాఘ్ నటించనుందట. యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన 'బంటీ ఔర్ బబ్లీ 2'తో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మహారాజ, వేదా వంటి సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు 'వార్ 2'లో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ ది నెగటివ్ షేడ్స్ పవర్ ఫుల్ అని పాత్ర అని తెలుస్తుండగా, శార్వరి పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
ప్రసుతం ఎన్టీఆర్ 'దేవర' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆ తర్వాత చేయబోయే 'వార్ 2'లోనూ మరో బాలీవుడ్ యంగ్ బ్యూటీతో తారక్ జత కడుతుండటం ఆసక్తికరంగా మారింది.