English | Telugu

అదీ త్రివిక్ర‌మ్ మ్యాజిక్ అంటే...

ఏ సినిమాకైనా - టాక్‌ని బ‌ట్టే వ‌సూళ్లు..! సినిమా బాలేద‌ని తెలిస్తే.. ఆ థియేట‌ర్ చుట్టుప‌క్క‌ల‌కు వెళ్ల‌డానికి కూడా జ‌నాలు భ‌య‌ప‌డుతున్నారు. రివ్యూలూ వ‌సూళ్ల‌లో త‌న వంతు పాత్ర పోషిస్తున్నాయి. అయితే స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి విష‌యంలో ఈ థీరీ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. ఈ సినిమాపై విప‌రీత‌మైన డివైడ్ టాక్ వ‌చ్చింది. సినిమా బాగుంది అన్న‌వాళ్లు కూడా ఏదో ఓ అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. మొత్తానికి ఇది త్రివిక్ర‌మ్ సినిమాలా లేదేంటి? అని పెద‌వి విరిచారు. అయితే... వ‌సూళ్లు మాత్రం భీక‌రంగా ఉన్నాయి. తొలి నాలుగు రోజుల‌కూ. 30 కోట్లు దాటేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి. ఓవ‌ర్సీస్‌లో దుమ్ము దులిపింది. త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌ల‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

రివ్యూలు నెగిటీవ్‌గా ఉన్నా, జ‌నాలు పెద‌వి విరుస్తున్నా, త్రివిక్ర‌మ్ అభిమానులు నొచ్చుకొంటున్నా ఈ వ‌సూళ్ల ఉదృతికి కార‌ణ‌మేంటి?? వెరీ సింపుల్‌. ఇది త్రివిక్ర‌మ్ సినిమా. త్రివిక్ర‌మ్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ చెత్త సినిమా తీయ‌డు.. అని జ‌నాలు బాగా న‌మ్ముతున్నారు. సినిమా బాలేదు.. అంటున్నా..`ఎలా ఉందో ఓసారి చూసొద్దాం..` అనేవాళ్లే ఎక్కువ‌య్యారు. సినిమాకి భారీవ‌సూళ్లు రావాలంటే రెండు మూడుసార్లు చూడొక్క‌ర్లెద్దు. అంద‌రూ ఒకొక్క‌సారి చూస్తే చాలు. ఇప్పుడు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తికీ అదే ఫార్ములా వ‌ర్క‌వుట్ అయ్యింది. ప్ర‌తీ ఒక్కరూ ''ఈసినిమా త్రివిక్ర‌మ్ ఎలా తీశాడో చూసొద్దాం'' అనుకొన్న‌వాళ్లే. దాంతో.. వ‌సూళ్ల‌కు కొద‌వ లేకుండా పోయింది. ఈ సినిమాకి వ‌చ్చిన హైప్‌.. దేవిశ్రీ పాట‌ల‌తో చేసిన మ్యాజిక్‌, ఉపేంద్ర‌, స్నేహ‌, నిత్య‌మీన‌న్‌లాంటి భారీ తారాగ‌ణం.. ప్రేక్ష‌కుల్ని ఊరిస్తున్నాయి. అదీ... స‌త్య‌మూర్తి స్పీడుకి కార‌ణం.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.