English | Telugu

త్రివిక్ర‌మ్‌కీ ఇలియానాకీ మ‌ధ్య ఏం జ‌రిగింది?

క‌థానాయ‌కుడికీ క‌థానాయిక‌కీ కెమిస్ట్రీ ఎంత అవ‌స‌ర‌మో, నాయిక‌కీ, ఆ ద‌ర్శ‌కుడికీ ట్యూనింగ్ అంతే అవ‌స‌రం. ఓ క‌థానాయిని స్టార్ గా మార్చాల‌న్నా, ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయేలా తెర‌పై ఆవిష్క‌రించాల‌న్నా అది ద‌ర్శ‌కుల‌కే సాధ్యం. అయితే ఎందుకనో ఇలియానా, త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య చెప్ప‌లేనంత గ్యాప్ వ‌చ్చింది. జ‌ల్సా కోసం తొలిసారి ఇలియానాని క‌థానాయిక‌గా ఎంచుకొన్నాడు త్రివిక్ర‌మ్‌. ఆసినిమా హిట్ట‌య్యింది. ఇలియానాకూడా బాగానే చేసింది. అందుకే ఆ త‌ర‌వాత జులయిలోనూ ఇలియానాకే క‌థానాయిక పోస్టుఇచ్చాడు. ఆ సినిమా హిట్ట‌యినా.... ఇలియానాకీ, త్రివిక్ర‌మ్‌కీ మ‌ధ్య చెడింది. షూటింగ్ స‌మ‌యంలో ఇలియానా...త్రివిక్ర‌మ్‌కి చుక్క‌లు చూపించింద‌ట‌.

సెట్లో ఇలియానా ప్ర‌వర్త‌న త్రివిక్ర‌మ్‌నే కాదు, చిత్ర‌బృందం మొత్తానికి షాక్ ఇచ్చేలా సాగింద‌ట‌. చెప్పిన స‌మ‌యానికి సెట్‌కి రాక‌పోవ‌డం, చెప్పాపెట్ట‌కుండా షూటింగ్‌కి డుమ్మా కొట్ట‌డంతో ఇలియానాపై త్రివిక్ర‌మ్ చాలాసార్లు సీరియ‌స్ అయ్యాడ‌ట‌. ఇక‌మీద‌ట ఇలియానాతో ప‌నిచేయ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడ‌ని టాక్‌. అందుకే ఆ త‌ర‌వాత ఇలియానా పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా త్రివిక్ర‌మ్ ఆస‌క్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది.

అయితే.. ఈమ‌ధ్య మాత్రం ఇలియానా త్రివిక్ర‌మ్‌తో ట‌చింగ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. నితిన్‌తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. కథానాయిక‌గా స‌మంత‌ని ఎంచుకొన్నారు. ఒక‌వేళ స‌మంత ఈ సినిమా చేయ‌లేని ప‌క్షంలో మ‌రో క‌థానాయిక‌ని ఎంచుకోవ‌డం త‌ప్ప‌దు. అందుకే ఇలియానా ఇప్పుడు త్రివిక్ర‌మ్‌ని కాకాప‌డుతోంద‌ట‌. `అవ‌స‌రం అనుకొంటే నా పేరు ప‌రిశీలించండి. మీతో మ‌రో సినిమా చేయాల‌నివుంది` అంటూ త్రివిక్ర‌మ్‌ని అడుగుతోంద‌ట‌. ఈసారి ఎలాంటి త‌ప్పు చేయ‌కుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలుగుతాన‌ని మాటిస్తోంద‌ట‌.
మ‌రోవైపు నితిన్ కూడా ఇలియానా పేరు సూచిస్తున్నాడ‌ట‌. స‌మంత కాల్షీట్లు దొర‌క‌ని ప‌క్షంలో ఇలియానాని తీసుకొంటే బాగుంటుంద‌ని చెప్తున్నాడ‌ట‌. ఇలియానా - నితిన్‌ల మ‌ధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇద్ద‌రూ క‌ల‌సి గ‌తంలో ఓ సినిమా చేశారు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ ప్రెండ్స‌యిపోయారు. ఆ చ‌నువుతోనే ఇలియానా పేరు సూచిస్తున్నాడ‌ట‌. మ‌రి హీరో మాట‌కు త్రివిక్ర‌మ్ ఎంత వ‌ర‌కూ విలువనిస్తాడో చూడాలి. ఇలియానా గ‌నుక త్రివిక్ర‌మ్ సినిమాలో మ‌రో సారి ఛాన్స్ అందుకొంటే.. అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.