English | Telugu

పవర్ స్టార్ ఊచకోత.. ఓటీటీలో ఓజీకి దిమ్మతిరిగే రెస్పాన్స్!

- పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ రేంజ్ చూపించిన ఓజీ
- ఓటీటీలోనూ రికార్డుల తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో 'ఓజీ' మరోసారి నిరూపించింది. బాక్సాఫీస్ ని షేక్ చేసి, బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ.. ఓటీటీలోనూ సంచలనాలు సృష్టిస్తోంది. (They Call Him OG)

పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్.. సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి.. పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగానూ నిలిచింది.

'ఓజీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు అంటే అక్టోబర్ 23న ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ లో 'ఓజీ' సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సుజీత్ స్టైలిష్ మేకింగ్ కి, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. యాక్షన్, విజువల్స్, మ్యూజిక్.. ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. దీంతో విడుదలైన నాటి నుండే నెట్‌ఫ్లిక్స్ లో ట్రెండింగ్ గా మారింది. పాన్ ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా, గ్లోబల్ స్థాయిలోనూ 'ఓజీ'కి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాలలో ఒకటిగా 'ఓజీ' నిలిచే అవకాశం కనిపిస్తోంది.

Also Read: బంగారం లాంటి వార్త.. రాజ్ తో కలిసి సమంత రెండో అడుగు!

'ఓజీ'కి పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, ఓటీటీలోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తుండంతో.. 'ఓజీ-2' ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి అభిమానులకు పవన్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.