English | Telugu

హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తమన్ !!


క్రికెట్ పరిభాషలో అయితే దీన్ని "ఫాస్టెట్ హాఫ్ సెంచరీ" అనొచ్చు. కేవలం అయిదు సంవత్సరాల సమయంలో యాభై చిత్రాల మైలురాయిని చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. కానీ తమన్ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.


శంకర్ దర్శకత్వంలో వచ్చిన "బోయ్స్" చిత్రంలో నటుడిగా పరిచయమైన తమన్.. ఆ తర్వాత "కిక్" చిత్రంతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి వరుసగా తెలుగు, తమిళ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.


ఒకవైపు స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్నందిస్తూనే.. మరోవైపు చిన్న హీరోల చిత్రాలకూ బాణీలు సమకూరుస్తున్న తమన్.. తాజాగా "శ్రీనువైట్ల_మహేష్‌బాబు" కాంబినేషన్‌లో వస్తున్న "ఆగడు" చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రమే తమన్ యాభైయ్యవ చిత్రంగా నిలవనుంది.


అయితే.. "క్వాంటిటీ కన్నా.. క్వాలిటీ మిన్న" అని నమ్మే మన తెలుగు పరిశ్రమలో తమన్ మరికొంత కాలం సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే... తన మూస ధోరణి నుంచి బయటకు వచ్చి.. కొత్త తరహా సంగీతాన్ని అందించాల్సిందే!

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.