English | Telugu

పవన్ గబ్బర్ సింగ్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ

పవన్ "గబ్బర్ సింగ్" ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, "షాక్", "మిరపకాయ్" సినిమాల ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, గణేష్ నిర్మించబోయే సినిమా "గబ్బర్ సింగ్". బాలీవుడ్ కండల కాంతారావు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "దబాంగ్" సినిమానే తెలుగులో "గబ్బర్ సింగ్" పేరుతో రీమేక్ చేస్తున్నారు. పవన్ "గబ్బర్ సింగ్" సినిమాలో హీరో పవన్ కళ్యాణ్‍ కి తల్లిదండ్రులుగా నందమూరి హరికృష్ణ, సహజనటి జయసుధ నటిస్తున్నారు.

యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమాకి సంగీతాన్నందిస్తున్నారు. పవన్ "గబ్బర్ సింగ్" సినిమా స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ ని హీరో పవన్ కళ్యాణ్ కి ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ వినిపించారట. స్క్రిప్ట్ చాలా సంతృప్తికరంగా వచ్చిందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. జూలైలో ప్రారంభమయ్యే పవన్ "గబ్బర్ సింగ్" సినిమా 2012 సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.