English | Telugu

రామానాయుడు స్టుడియోలో నాగ్ డమరుకం

రామానాయుడు స్టుడియోలో నాగ్ "డమరుకం" షూటింగ్ జరుపుకుంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, యువసామ్రాట్, కింగ్, అక్కినేని నాగార్జున హీరోగా, అనుష్క హీరోయిన్ గా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం" డమరుకం". ఈ నాగ్ "డమరుకం" సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో శరవేగంగా జరుగుతూంది. ఇటీవల జూన్ 6 వ తేదీ నుండి నాగ్ "డమరుకం" చిత్రం షూటింగ్ బి.హెచ్.ఇ.యల్.సమీపంలో కల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివారి దేవాలయంలో అనుష్క, బ్రహ్మాజీ తదితరుల మీద చిత్రీకరించారు.

ఇప్పటికే ఈ నాగ్ "డమరుకం" సినిమాలోని ఒక పాటను హీరో నాగ్, హీరోయిన్ అనుష్కలపై యూరప్ లో చిత్రీకరించారు. ఇది నాగార్జున సిని కెరీర్ లోనే అత్యంతభారీబడ్జెట్ సినిమాగా నిర్మించబడుతుంది. 53 నిమిషాల పాటు గ్రాఫిక్స్ వర్క్ ఉండే ఈ చిత్రం బడ్జెట్ 50 కోట్లని సమాచారం.నాగ్ "డమరుకం" సినిమాకి యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూండగా, ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.