English | Telugu

రచ్చలో ముఠా మేస్త్రిగా రామ్ చరణ్...?

"రచ్చ" లో ముఠామేస్త్రిగా రామ్ చరణ్...నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైందీ ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "రచ్చ".ఈ "రచ్చ" సినిమాలో హీరో రామ్ చరణ్ గతంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ముఠామేస్త్రి" సినిమాలోని దేశభక్తి పరుడైన ముఠామేస్త్రి వంటి పాత్రలో నటించనున్నాడని తెలిసింది. అది అవుట్ అండ్ అవుట్‍ పక్కా మాస్ పాత్ర.

తన కెరీర్ గ్రాఫ్ మళ్ళీ పైకి లేవాలంటే పూర్తిస్థాయి మాస్ పాత్రలోనే నటించాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అదే విషయాన్ని దర్శకుడు సంపత్ నందితో కూడా చెప్పాడట. "రచ్చ" సినిమాలో "ముఠామేస్త్రి" సినిమాలోని చిరంజీవి టైపు పాత్రతో పాటు,"గ్యాంగ్ లీడర్" సినిమాలోని "వానవాన వెల్లూవాయే" అనే పాటను కూడా రామ్ చరణ్ ఈ "రచ్చ" సినిమాసినిమా కోసం వాడుకోవటం విశేషం. రచ్చ" సినిమాలో కలర్స్ స్వాతి కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనుంది. ఈ "రచ్చ" సినిమా ఈ వారంలోనే ప్రారంభం కానుంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.