English | Telugu

‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో రిలీజ్ డేట్

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ప్రస్తుతం స్పెయిన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియోను మార్చి 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ అంటేనే పాటలపైన అంచనాలు భారీగా వుంటాయి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని ఆడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రలలో నటిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.