English | Telugu

కాబోయే భార్య హరిణ్యరెడ్డి కి సర్ ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

-రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు మొదలు
-నాటు నాటు తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు
-హరిణ్యరెడ్డి, చాహల్ పిక్స్ వైరల్


ఆర్ఆర్ఆర్ లోని 'నాటునాటు' సాంగ్ తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా తన సత్తా చాటే రాహుల్ గాత్రం నుంచి ఇప్పటి వరకు సుమారు వంద పాటల దాకా వచ్చి అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాయి. రాహుల్ కి హరిణ్య రెడ్డి తో తన స్వస్థలం హైదరాబాద్ లో ఈ నెల 27వ తేదీన వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకి పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా రీసెంట్ గా నిర్వహించిన సంగీత్ వేడుకలో హరిణ్యకు రాహుల్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.


హరిణ్యకి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ 'యుజ్వేంద్ర చాహల్' కి వీరాభిమాని. దీంతో రాహుల్ తన సంగీత్ వేడుకకి చాహల్‌ని ఆహ్వానించాడు. దీంతో హరిణ్య ఆనందానికి అవధులు లేవు. ఈ మేరకు చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలని హరిణ్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రాహుల్ కి థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరిణ్య కి రాహుల్ ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ లు ఇస్తూ సంతోషపెడుతున్నాడు. నిశ్చితార్థ సమయంలో కూడా హరిణ్య కోసం ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.


Also read: రామ్ చరణ్ రికార్డుని ప్రభాస్ అందుకోగలడా!.. ప్రస్తుతానికి చరణ్ టాప్

రాహుల్ సినీ కెరీర్ ని చూసుకుంటే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిత్ర మండలి లో కత్తి అందుకో జానకి అనే సాంగ్ తో తనదైన స్టైల్లో అలరించాడు. నటుడుగాను అడపాదడపా సిల్వర్ స్క్రీన్ పై మెరుసుతున్న విషయం తెలిసిందే.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం